E-Paper
Advertisement

Gachibowli History: ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!

Gachibowli History: ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!
Advertisement

Untold History of Gachibowli: హైదరాబాద్‌ గచ్చిబౌలి అనగానే.. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు, భారీ భవంతులు, కళ్లు చెదిరే అద్దాల మేడలు, అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు గుర్తుకొస్తాయి. కానీ, ఈ ప్రాంతానికి ‘గచ్చిబౌలి’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? చాలామందికి తెలియని ఈ ఆసక్తికరమైన చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గచ్చి బావి నుంచి గచ్చిబౌలిగా..

ప్రస్తుతం అత్యాధునిక ప్రాంతంగా గచ్చిబౌలి ఒకప్పుడు పూర్తిగా రాళ్లు రప్పలతో నిండి ఉండేది. అప్పట్లో ఇక్కడ ఒక పెద్ద మెట్ల బావి ఉండేదని చరిత్ర చెబుతోంది. ఆ బావిని సున్నపురాళ్లతో నిర్మించారట. అందుకే స్థానికులు దానిని ‘గచ్చి బావి’ అని పిలిచేవాళ్లు. ‘గచ్చి’ అనే పదానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో సున్నం లేదంటే గచ్చు అనే అర్థం ఉంది. ఆ కాలంలో సున్నంతో నిర్మించిన కట్టడాలు చాలా బలంగా ఉండేవి. ఈ బావి కూడా అలాంటి నిర్మాణమే కావడంతో ప్రజలు దాన్ని ‘గచ్చి బావి’ అని పిలవడం మొదలుపెట్టారు. కాలక్రమేణా పేరు మారుతూ  ఇప్పటి ‘గచ్చిబౌలి’గా మారింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ హబ్‌గా నిలిచిన ఈ ప్రాంతం పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందని చాలా మందికి తెలియదు.

హైదరాబాద్ అడుగడుకూ ఓ చరిత్ర..

Advertisement

హైదరాబాద్‌ లో ఇలాంటి చరిత్ర కలిగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పాత బావులు, చెరువులు, కోటలు, పురాతన నిర్మాణాల ఆధారంగా ఎన్నో ప్రాంతాలకు పేర్లు వచ్చాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయినా, వాటి పేర్లు మాత్రం నగర చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో  ప్రభుత్వం కూడా పాత మెట్ల బావులు, చారిత్రక కట్టడాలను సంరక్షించే పనులు చేపడుతోంది. కొన్ని బావులను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఆధునిక గచ్చిబౌలి గురించి..

ప్రస్తుతం గచ్చిబౌలి అంటే వేలాది మంది ఉద్యోగులు పనిచేసే ఐటీ కంపెనీలు, ఆధునిక రహదారులు, పెద్ద ఆఫీస్ లు కనిపిస్తాయి. కానీ, ఒకప్పుడు అక్కడ ఉన్న ‘గచ్చి బావి’ కారణంగానే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. హైదరాబాద్ లో కనిపించే చాలా ప్రాంతాల పేర్ల వెనుక కూడా ఇలాంటి ఆసక్తికరమైన కథలే దాగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే నగర చరిత్రపై మరింత అవగాహన పెరుగుతుంది. గచ్చిబౌలి పేరు వెనుక ఉన్న చరిత్ర, హైదరాబాద్ గొప్ప వారసత్వానికి మరో అందమైన గుర్తుగా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: ఇన్నాళ్లు తార్నకలో తిరిగాం.. కానీ, ఈ పేరు వెనుక ఇంత చరిత్ర ఉందని తెలియదే!

Related News

వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!

సౌదీ అరేబియాకు వెళ్లొద్దు.. హౌతీ దాడులతో పలు దేశాల హెచ్చరికలు!

పెంగ్విన్ల మలంతో కరుగుతున్న మంచు.. అంటార్కిటికాలో వింత పరిణామం!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

Big Stories

Advertisement
×