Best washing machines: వర్షా కాలం వచ్చిందంటే చాలు.. వాతావరణం చల్లగా మారి మనసు హ్యాపీగా ఉంటుంది కానీ.. ఇంట్లో ఆడ వారికి మాత్రం ఒకే ఒక్క పెద్ద టెన్షన్ మొదలవుతుంది. అదే.. “బట్టలు ఎలా ఆరబెట్టాలి?”. ఈ సీజన్ లో రోజులు గడిచినా బట్టలు సరిగ్గా ఆరవు, పైగా వాటి నుంచి ఒక రకమైన తడి వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి వర్షాకాలం లాండ్రీ కష్టాలన్నింటికీ చెక్ పెట్టేలా, బట్టలను సూపర్ ఫాస్ట్‌గా ఆరబెట్టే.. శక్తున్న టాప్ 5 ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో.. కస్టమర్లు, కేవలం బట్టలు ఉతికే మెషీన్ల కంటే.. క్విక్ డ్రైయింగ్ , బిల్ట్-ఇన్ హీటర్,యాంటీ-బ్యాక్టీరియల్ టెక్నాలజీ ఉన్న వాషింగ్ మెషీన్లను సెర్చ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మీ వర్షాకాలాన్ని ఈజీగా మార్చేసే ఆ 5 బెస్ట్ మోడల్స్ ఇవే..
1. ఎల్‌జీ ఏఐ డైరెక్ట్ డ్రైవ్ విత్ స్టీమ్ :
ఈ ఏఐ వాషింగ్ మెషీన్ బట్టల బరువును, ఫ్యాబ్రిక్ టైప్ ని తనే గుర్తించి దానికి తగ్గట్టుగా ఉతుకుతుంది. ఇందులో.. ఉండే ‘స్టీమ్ వాష్’ ఫీచర్ వర్షా కాలంలో బట్టలపై.. చేరే జిడ్డును, అలర్జీలను వంద శాతం తొలగిస్తుంది. దీని హై-స్పీడ్ స్పిన్ డ్రైయర్ బట్టల్లోని.. తడిని దాదాపు పూర్తిగా పిండేస్తుంది. కాబట్టి బట్టలు ఫ్యాన్ కింద వేసినా క్షణాల్లో ఆరిపోతాయి.
2. శామ్‌సంగ్ ఎకోబబుల్ విత్ హైజీన్ స్టీమ్:
శామ్‌సంగ్ బ్రాండ్ కి చెందిన ఈ మోడల్ వర్షాకాలానికి బెస్ట్. ఇందులోని.. ఎకోబబుల్ టెక్నాలజీ చల్లటి నీటిలో కూడా డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల లోపలి వరకు క్లీన్ చేస్తుంది. దీని హైజీన్ స్టీమ్ ఫీచర్ బట్టలకు ఉండే మురికిని, చెడు వాసనలను, బ్యాక్టీరియాను పూర్తిగా నశింపజేస్తుంది.
3. ఐఎఫ్బీ నియో దివా విత్ 3డీ వాష్:
ఐఎఫ్బీ వాషింగ్ మెషీన్స్ వాటి బిల్డ్ క్వాలిటీకి చాలా ఫేమస్. ఇందులో ఉండే బిల్ట్- హీటర్ నీటిని వేడి చేసి వండర్ ఫుల్ గా ఉతుకుతుంది. వర్షా కాలంలో బట్టలు త్వరగా ఆరడానికి వేడి నీటి వాష్ చాలా సహాయపడుతుంది. దీని ఎయిర్ డ్రైయర్ ఫీచర్ గాలిని వేగంగా లోపలికి లాగి, బట్టల్లోని తేమను చాలా త్వరగా ఆవిరి చేస్తుంది.
4. బాష్ ఫ్రంట్ లోడ్ విత్ యాంటీ-టాంగిల్:
వర్షాకాలంలో.. బట్టలు ఒకదానికొకటి చుట్టుకుపోయి ఇంకా ఎక్కువ తడిగా ఉంటాయి. బాష్ వాషింగ్ మెషీన్ లోని యాంటీ-టాంగిల్ ఫీచర్ బట్టలు ముడిపడకుండా.. విడివిడిగా ఉతికేలా చేస్తుంది. దీని 1200 RPM హై-స్పీడ్ మోటార్ స్పిన్ చేసేటప్పుడు.. బట్టల్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా గట్టిగా పిండేస్తుంది.
Also Read: కిచెన్‌లో ఇవి ఉంటే.. చిమ్నీల అవసరమే లేదు!
5. వర్ల్‌పూల్ రాయల్ ప్లస్ విత్ హార్డ్ వాటర్ వాష్ :
మీ బడ్జెట్ కాస్త తక్కువగా.. ఉండి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలంటే.. వర్ల్‌పూల్ టాప్ లోడ్ మెషీన్ బెస్ట్ ఛాయిస్. ఇందులో.. ఉండే ఐదు నక్షత్రాల ఎనర్జీ రేటింగ్ కరెంట్ బిల్లును ఆదా చేస్తుంది. దీనిలోని.. ‘స్పిన్ డ్రై’ ఆప్షన్ వర్షాకాలపు దట్టమైన చలిలో కూడా బట్టలను త్వరగా ఆరిపోయేలా చేస్తుంది.
వర్షాకాలంలో బట్టలు ఆరక ఇల్లంతా తడి బట్టల వాసనతో.. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఐదు బెస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లలో ఏదో ఒకదాన్ని మీ బడ్జెట్ బట్టి ఎంచుకుంటే.. వర్షం ఎంత పడినా మీ ఇంట్లో లాండ్రీ పనులు అస్సలు ఆగవు. స్మార్ట్ గా.. అప్‌గ్రేడ్ అవ్వండి, వానాకాలాన్ని కూడా ఎంజాయ్ చేయండి.