Hidden History of Tarnaka: హైదరాబాద్ లో ఉండేవారికి ‘తార్నక’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రతిరోజూ వేలాది మంది ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుంటారు. కానీ, ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. పేరు వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యం కలగకమానదు.
చాలామంది తార్నక అనేది తెలుగు పేరు అనుకుంటారు. కానీ, ఈ పదం పర్షియన్ భాషకు చెందినది. నిజాం పాలనలో హైదరాబాద్ లో పర్షియన్, ఉర్దూ భాషల ప్రభావం ఎక్కువగా ఉండేది. అప్పట్లో సిటీలోని చాలా ప్రాంతాలకు ఆ భాషల నుంచే పేర్లు వచ్చాయి. వాటిలో తార్నక కూడా ఒకటింది.
నిజానికి ‘తార్’ అంటే తీగ లేదంటే వైర్ అనే అర్థం వస్తుంది. ‘నాకా’ అంటే చెక్ పోస్ట్ లేదంటే ఎంట్రెస్ అనే మీనింగ్ ఉంది. ఈ రెండు పదాలు కలిసే ‘తార్-నాకా’ అనే పేరు ఏర్పడిందని చరిత్రకారులు చెప్తుంటారు. కాలక్రమేణా అది ప్రజల వాడుకలో తార్నాకగా మారిపోయింది. అసలు ఇక్కడ తీగలతో సంబంధం ఏంటని చాలా మంది డౌట్ వస్తుంది. అప్పట్లో ఈ ప్రాంతం మీదుగా టెలిగ్రాఫ్ లైన్లు వెళ్లేవట. వాటి మెయింటెనెన్స్ కోసం ఇక్కడ ఒక చెక్‌పోస్ట్ ఉండేది. అందుకే ఆ ప్రాంతాన్ని’తార్- నాకా’ అని పిలిచేవారని చరిత్రకాలు చెప్తారు. ఆ తర్వాత అదే పేరు శాశ్వతమైంది.
నిజాం నవాబుల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లో పెద్ద మామిడి తోట ఉండేదట. ఆ తోటను, పరిసరాలను కాపాడేందుకు చుట్టూ తీగలతో కంచె ఏర్పాటు చేశారరట. దానికి ఓ ఎంట్రెన్స్ కూడా పెట్టారు. అలా ఆ ప్రాంతాన్ని ‘తార్-నాకా’ అని పిలవడం మొదలుపెట్టారు. కాలక్రమేణా అదే పేరు ‘తార్నాక’గా మారిపోయింది.
ఇప్పుడు తార్నక అనగానే ఎటు చూసినా విద్యాసంస్థలు, బిజీ బిజీ రహదారులు, వ్యాపార కేంద్రాలు కేరాఫ్ గా మారిపోయింది. కానీ, ఒకప్పుడు ఈ ప్రాంతం నగర సరిహద్దుకు సమీపంలో ఉన్న కీలక ఎంట్రెన్స్ గా ఉండేది. కాలం మారినా, నగరం విస్తరించినా, అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ ఈ పేరు మాత్రం అలాగే కొనసాగుతోంది. అంతేకాదు, హైదరాబాద్ లోని అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, మలక్ పేట్ లాంటి ప్రాంతాల పేర్ల వెనుక కూడా ఇలాంటి ఆసక్తికరమైన కథలే ఉన్నాయి. ప్రతిరోజూ మనం పలికే ఈ పేర్లు, నగరం శతాబ్దాల చరిత్రను నిశ్శబ్దంగా మోస్తూనే ఉన్నాయి. ఇకపై తార్నక మీదుగా వెళ్లిన ప్రతిసారీ దాని చరిత్రను ఓసారి తలచుకోండి. ఒక సాధారణ ప్రాంతం పేరు వెనుక అసాధారణ కథ దాగి ఉంటుందని గుర్తుంచుకోండి!
Read Also: ప్రకృతి అందాల వెనుక పెను ప్రమాదం.. వర్షాకాలంలో వెళ్లకూడని 6 డేంజరస్ ప్లేసెస్ ఇవే!