E-Paper
Advertisement

Minor Driving: పిల్లలపై ప్రేమతో ఇలా చేస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడినట్టే..?

Minor Driving: పిల్లలపై ప్రేమతో ఇలా చేస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడినట్టే..?
Advertisement

Minor Driving: స్వేచ్చ బ్యూరో: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న ‘మైనర్ డ్రైవింగ్’కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర రవాణాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే ఇకపై కేవలం జరిమానాలతో సరిపెట్టేది లేదని, ఏకంగా ఆ వాహన రిజిస్ట్రేషన్‌నే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు, ప్రమాదాల నివారణే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వాహనాల రెజిస్ట్రేషన్లను రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ‘ఉక్కుపాదం’ మోపుతోంది.

సెక్షన్ 199 A (4) ప్రకారం..

రవాణాశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారి చేసింది. మైనర్ నడిపిన వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా మైనర్లకు వాహనాలు ఇవ్వడంతో ఆ వాహనం రిజిస్ట్రేషన్ ను సెక్షన్ 199 A (4) ప్రకారం ఏడాది పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు ప్రకటించింది. వాహన తనిఖీలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4260 వాహనాలను మైనర్లు నడుపుతుండగా పట్టుబడ్డాయి. ఇందులో మోటార్ సైకిల్లు 4032 ఉండగా ఆటోలు 18, గూడ్స్ వాహనాలు 9, కార్లు 11 ఉన్నాయి.

రద్దుల్లోనూ హైదరాబాద్‌దే అగ్రస్థానం

Advertisement

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని రవాణాశాఖ అధికారులు ‘ఉక్కుపాదం’ మోపుతున్నారు. ఇందులో భాగంగా ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4,260 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అవగాహన సదస్సులు నిర్వహించినా, కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో నేరుగా వాహనాల రిజిస్ట్రేషన్లనే రద్దు చేసేలా రవాణాశాఖ దూకుడు పెంచింది. మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనల్లో రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. నగర పరిధిలో విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో అత్యధికంగా 3,523 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. నిజామాబాద్ జిల్లా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 286 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 164, యాదాద్రిలో 13, వరంగల్ 2, వికారాబాద్ లో 5, సూర్యాపేటలో 5, సంగారెడ్డిలో 9, నల్లగొండలో 1, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 40, మహబూబాబాద్ లో 3, మహబూబ్ నగర్ లో 5, మెదక్ లో 1, కరీంనగర్ లో 1, కామారెడ్డిలో 6, జనగాంలో 2, జగిత్యాలలో 1 వాహనంను రద్దు చేసి యజమానులకు రవాణాశాఖ గట్టి షాక్ ఇచ్చింది.

Also Read: కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

తల్లిదండ్రులకు హెచ్చరిక..

Advertisement

పిల్లల ముచ్చట తీర్చేందుకు లేదా వారికి డ్రైవింగ్ నేర్పేందుకు తల్లిదండ్రులు వాహనాల తాళాలు ఇస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రవాణాశాఖ హెచ్చరిస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో పాటు మోటారు వాహనాల చట్టం ప్రకారం యజమానులపై లేదా తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. మైనర్ల డ్రైవింగ్ వల్ల వారి ప్రాణాలతో పాటు, రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.

చట్టం ఏం చెబుతోంది..

మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 199-ఏ (2019 సవరణ) ప్రకారం, ఒక మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఆ వాహన యజమాని/సంరక్షకుడు నేరస్తునిగా పరిగణించబడి, చట్టం నిర్దేశించిన శిక్షకు అర్హులవుతారు. దీంతో నేరానికి వినియోగించిన వాహనం రిజిస్ట్రేషన్ పన్నెండు నెలల పాటు రద్దు చేయబడుతుంది. ఆ మైనర్‌కు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయబడదు.

రోడ్డు భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేవలం జరిమానాలతో సరిపెట్టేది లేదు. వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు, యజమానులపై తల్లిదండ్రులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తప్పవు. పిల్లల భవిష్యత్తును, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి. రోడ్డు భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. రెండోసారి మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఊరుకునేది లేదని చట్టం కఠినంగా ఉటుందని జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

Also read: Drug Scam: మరీ ఇంత దారుణమా.. గాంధీ హాస్పిటల్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..?

Related News

Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్‌ను పని ఖతం..!

Power Complaints: మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా.. వెంటనే ఇలా చేయండి?

సాగునీటి హక్కులా.. పొలిటికల్ మైలేజ్‌లా.. తెలంగాణలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా బీఆర్ఎస్ ప్లాన్..?

Drug Scam: మరీ ఇంత దారుణమా.. గాంధీ హాస్పిటల్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..?

Ganja Smuggling: మేడ్చల్‌లో భారీ గంజాయి కలకలం.. ఫ్రెండ్స్‌తో ఎలా దోరికాడంటే..?

డబ్బులిస్తేనే పని అవుతుందన్నాడు.. కట్ చేస్తే రూ. 2 లక్షలతో పాటు బుక్కయ్యాడు!

మూడు వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్లు.. సీఎం రేవంత్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రకటన

Big Stories

Advertisement
×