E-Paper
Advertisement

తొలకరి జల్లులు.. ఆరుద్ర పురుగులు.. ఈ ఎర్రని అతిథులంటే రైతులకు ఎందుకంత ప్రేమో తెలుసా?

తొలకరి జల్లులు.. ఆరుద్ర పురుగులు.. ఈ ఎర్రని అతిథులంటే రైతులకు ఎందుకంత ప్రేమో తెలుసా?
Advertisement

Arudra Bugs-Monsoon: తొలకరి జల్లులు పడగానే పల్లెల్లో అందమైన దృశ్యం కనిపిస్తుంది. నల్లటి రేగడు నేలలు, ఎరుపు రంగు ఇసుక నేలలపై కుంకుమ లాంటి మృదువైన ముద్దొచ్చే ఆరుద్ర పురుగులు సందడి చేస్తాయి. వాటిని చూసిన వెంటనే అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లువిరిస్తుంది. ఆనందంతో పొలాల వైపు అడుగులు వేస్తారు. ఎందుకంటే ఈ చిన్న పురుగులను శుభసూచకంగా భావిస్తారు. దైవంతో సమానంగా భావిస్తారు. ఆ ఏడాదంతా వానలకు ఎలాంటి ఢోకా లేదని భావిస్తారు.

తొలకరిలో మాత్రమే కనిపించే అరుదైన పురుగులు

ఆరుద్ర కార్తె సమయంలో లేదంటే తొలకరి వర్షాల తర్వాత మాత్రమే ఈ పురుగులు కనిపిస్తాయి. సంవత్సరంలో మిగతా రోజుల్లో ఇవి కనిపించవు. అందుకే వీటిని ‘ఆరుద్ర పురుగులు’ అని పిలుస్తారు. వర్షాలు బాగా పడబోతున్నాయనే సంకేతంగా రైతులు వీటిని నమ్ముతారు. అందుకే ఆరుద్ర పురుగులు కనిపిస్తే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని ఆశతో సాగు పనులు మొదలుపెడతారు.

Advertisement

పల్లెటూర్లలో పెద్దవాళ్లు ఈ పురుగులను సాధారణ జీవులుగా చూడరు. ప్రకృతి శుభ సూచనగా భావిస్తారు. కొందరు వీటిని వరుణదేవుడి ఆశీర్వాదంగా చెబుతుంటారు. అందుకే ఎవరూ వీటిని చంపరు. పైగా ఎవ్వరినీ చంపనివ్వరు. ప్రకృతితో కలిసి జీవించే సంస్కృతికి ఇవి అందమైన ఉదాహరణగా నిలుస్తాయి.  ఆరుద్ర పురుగులు కనిపించాయంటే చెరువులు, కుంటలు నిండేలా వర్షాలు పడతాయని రైతుల్లో ఒక నమ్మకం. శాస్త్రీయంగా ఇది పూర్తిగా నిర్ధారించబడకపోయినా, తరతరాలుగా వస్తున్న అనుభవాల ఆధారంగా ఈ విశ్వాసం కొనసాగుతోంది. అందుకే ఇప్పటికీ గ్రామాల్లో ఈ పురుగులకు ప్రత్యేక గౌరవం ఉంది.

ముట్టుకుంటే మృదువుగా..

ఆరుద్ర పురుగులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఎర్రని రంగు, మెత్తటి వెల్వెట్‌ లాంటి శరీరం ఎంతో మృదువుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని ఇంద్రగోప పురుగు, చందమామ పురుగు, బాపని పురుగు లాంటి పేర్లతో కూడా పిలుస్తారు. చేతితో తాకితే మెల్లగా ముడుచుకుని కదలకుండా ఉండడం వీటి మరో ప్రత్యేక లక్షణం.  సాధారణంగా ఇసుక మట్టి ఎక్కువగా ఉండే ప్రదేశాలు, పచ్చిక పెరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వర్షం పడిన కొద్దిసేపటికే నేలపైకి వచ్చి గుంపులుగా తిరుగుతూ కనువిందు చేస్తాయి. కొద్ది రోజుల తర్వాత మళ్లీ మట్టిలో కలిసిపోతాయి. అందుకే వీటిని చూడటం అరుదైన అనుభూతిగా భావిస్తారు.

Advertisement

Read Also: తొలకరి జల్లు పడగానే వచ్చే మట్టి వాసన ఎందుకు అంత అద్భుతంగా ఉంటుంది? అసలు ఆ పరిమళం ఎలా ఏర్పడుతుంది?

మాయమవుతున్న ఆరుద్ర పురుగులు

మారుతున్న కాలంతో పాటు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరగడంతో ఈ ఆరుద్ర పురుగుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. ప్రకృతికి మేలు చేసే ఇలాంటి చిన్న జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.  వానపాములు భూసారానికి ఎంత మేలు చేస్తాయో.. ఆరుద్ర పురుగులు రైతులకు సాగు మీద అంత ఆశను నింపుతాయి. అందుకే పల్లె సంస్కృతిలో ఆరుద్ర పురుగులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం పురుగులు మాత్రమే కాదు.. వర్షాలకు, పంటలకు, రైతుల ఆశలకు ప్రతీకలు కూడా.

Read Also: ఇన్నాళ్లు తార్నకలో తిరిగాం.. కానీ, ఈ పేరు వెనుక ఇంత చరిత్ర ఉందని తెలియదే!

Related News

సౌత్ ఇండియన్ కాశ్మీర్ ‘మున్నార్’.. హైదరాబాద్ నుంచి ఈ హిల్ స్టేషన్ కు వెళ్లాలంటే?

అక్కడ హోటళ్లకు ఉద్యోగులు దొరక్క.. రోబోలతో పని కానిచ్చేస్తున్నారు!

కక్కుర్తిగాళ్ల చేతివాటం.. బెడ్ రోల్స్ నొక్కేయడం వల్ల రైల్వేకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

ఇప్పుడంటే బిర్యానీ ఫేమస్.. పూర్వం హైదరాబాదీలు ఇష్టంగా తిన్న ఫుడ్ ఏది? మీ ఊహకు సైతం అందదు!

నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?

మాన్సూన్ గోవా ట్రిప్.. అస్సలు మిస్ కాకూడని 7 క్రేజీ స్పాట్స్ ఇవే!

వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

ఇండియన్ బుల్లెట్ రైలు లాంచ్ డేట్ ఫిక్స్.. స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×