E-Paper
Advertisement

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!
Advertisement

JC Prabhakar: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన, వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆ నాయకులను నమ్ముకుంటే నష్టపోతారు

Advertisement

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు, ప్రజలకు సంచలన హెచ్చరిక చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, బోగాతి నారాయణరెడ్డిలను నమ్ముకొని స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేస్తే తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు. వారు కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రమే చేస్తారని, వారి స్వార్థం కోసం ఇప్పటికే ఎన్నో కుటుంబాలు బలైపోయాయని మండిపడ్డారు. అలాంటి వారి వెనుక నడిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.

పోటీ పార్టీల మధ్య కాదు.. మా ఇద్దరి మధ్యే!

Advertisement

ఈ పర్యటనలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన మరొక ముఖ్యమైన వ్యాఖ్య స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ పోటీ అనేది తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య కాదని.. కేవలం తనకి, కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య మాత్రమేనని తేల్చి చెప్పారు. తాడిపత్రి ప్రాంతంలో తనకున్న పట్టును, ప్రజాదరణను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు!

కేతిరెడ్డి పెద్దారెడ్డికి నేరుగా సవాల్ విసిరిన జేసీ.. ‘నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ కుమారులను పోటీలో నిలబెట్టు. అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరికి ఎలాంటి తీర్పు ఇస్తారో తేలిపోతుంది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సొంత నియోజకవర్గంలోనే కాకుండా పక్కనున్న సింగనమల నియోజకవర్గంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ స్థాయిలో దూకుడుగా పర్యటించి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

Tags

Related News

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

శ్రీకాకుళంలో ఘోర విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు విద్యార్థులు.. ఇద్దరు మృతి!

చంద్రబాబూ.. ఇవి విజయాలు అనుకుంటే పొరపాటే!- సజ్జల రామకృష్ణారెడ్డి

నగరిలో మళ్లీ ఎన్నికలు గ్యారెంటీ.. కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న రోజా వ్యాఖ్యలు!

కూటమిలో జెడ్పీటీసీ-ఎంపీటీసీ సీట్ల లొల్లి.. 50- 60 శాతం మేము పోటీ చేస్తాం- నాగబాబు

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి

Big Stories

Advertisement
×