E-Paper
Advertisement

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే
Advertisement

JEE Main-2027 Registration: దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్-2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈసారి పలు మార్పులు చేసినట్టు తెలుస్తోంది. రీక్ష తేదీల్లో మార్పులతోపాటు ముఖ్యమైన అప్‌డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. దేశంలో అతి పెద్ద ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్-2027 సెషన్ 1 కి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. శనివారం ఎన్టీఏ వెల్లడించింది. బి.టెక్, బి.ఆర్క్ కోర్సులలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీఏ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ను యాక్టివేట్ చేసింది.

Advertisement

జేఈఈ మెయిన్-2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 22 వరకు ఉంటుంది. అయితే జేఈఈ మెయిన్-2027 సెషన్ 1 పరీక్ష తేదీ మార్చింది. అంతకుముందు సెషన్ 1 పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో జరిగేవి. కానీ ఈ షెడ్యూల్ మార్చినట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు 2027 జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీలలో జరగనున్నాయి.

జేఈఈ మెయిన్- 2027 సెషన్ 1 పరీక్ష ఆరు రోజుల పాటు జరుగుతుంది. గతంలో మాదిరిగానే పరీక్షను రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరగనుంది. JEE మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 BE, BTech అడ్మిషన్ల కోసం, పేపర్-2 BArch, B Planning Architecture కోసం నిర్వహిస్తారు.

Advertisement

NIT, IIITలలోని BE, BTech వంటి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలలో -CFTI లు BTech/BE కోర్సులలో ప్రవేశం కోసం JEE మెయిన్ పేపర్-1 నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినవారు మాత్రమే అడ్వాన్స్‌కు వెళ్తారు. అందులో విజయం సాధిస్తే ఐఐటీల్లో సీటు సాధించవచ్చు. లేకుంటే NIT, IIIT ల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది.

JEE మెయిన్-2027 సెషన్ 1 పరీక్ష ఫారంతోపాటు రిజర్వేషన్ లేని కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు రూ.1000 ఫీజు, రిజర్వేషన్ లేని కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 900 చెల్లించాల్సి వుంటుంది. జనరల్ ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు రూ. 800 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ట్రాన్స్‌జెండర్/దివ్యాంగుల కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ.500 రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

కీలక విషయాలు ఇవే

1. జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడానికి కొన్ని మార్పులు చేశారు. ఎన్‌టిఎ ఓ కొత్త గుర్తింపు ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అభ్యర్థులు భారత ప్రభుత్వం అందించే డిజిలాకర్, మేరీ పెహచాన్, లేదా జన్ పరిచయ్ వంటి డిజిటల్ సేవల్లో ఒకదానిని ఉపయోగించి నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ మార్గాల ద్వారా తమ గుర్తింపు, విద్యా పత్రాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అందించే సమాచారంలో తప్పులను తగ్గించడం, మోసగాళ్లు నకిలీ దరఖాస్తులు సమర్పించకుండా నిరోధించడం, పత్రాల ధృవీకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడం ఈ వ్యవస్థను అమలు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

2. ఈసారి దరఖాస్తు ఫారం నింపేటప్పుడు సిస్టమ్ వెబ్‌క్యామ్ లేకుంటే మొబైల్ నుండి QR కోడ్‌ను స్కాన్ చేసి అభ్యర్థి యొక్క లైవ్ ఫోటో తీయడం తప్పనిసరి చేసింది.

3. జాతీయ పరీక్షల ఏజెన్సీ విద్యార్థులకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. విద్యార్థి నవంబర్ 22 లోగా దరఖాస్తు చేసుకోలేకపోతే నవంబర్ 23 నుండి నవంబర్ 26 వరకు ఫారం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 26తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈసారి దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 20 లక్షలమంది హాజరవుతారని ఓ అంచనా.

ALSO READ: భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

Related News

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.. విజయవాడ కోర్టులో 102 పేజీల FIR!

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు.. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే!

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఉమ్మడి చిత్తూరులో ఎలక్షన్ హీట్.. నామినేషన్ల రగడ.. కలెక్టర్ క్లాస్!

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!

Big Stories

Advertisement
×