E-Paper
Advertisement

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!
Advertisement

Kotamreddy Sridhar: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్సీపీ తీరును తీవ్రంగా తప్పుబడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు

Advertisement

వైసీపీని ఒక ‘క్రిమినల్ లిటికెంట్ పార్టీ’గా అభివర్ణించిన కోటంరెడ్డి, గత పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. అయితే, అడుగడుగునా జగన్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండపడ్డారు. చివరికి కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవడానికి, ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

న్యాయస్థానాలు, అధికారులపై దాడులు

Advertisement

వైసీపీ సోషల్ మీడియా సుప్రీంకోర్టు తీర్పులను కూడా తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో పాటు కూటమి నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతూ.. రివర్స్‌లో కోర్టులకే తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి క్రిమినల్ మనస్తత్వం ఉన్న పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు రూరల్‌లో ఏకగ్రీవాలు, నామినేషన్లు

నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక ఎన్నికల సరళిపై స్పందిస్తూ.. మొత్తం 36 స్థానాల్లో ఇప్పటికే 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మరో 9 స్థానాల్లో వైసీపీ ప్రధాన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో కేవలం డమ్మీ అభ్యర్థులే బరిలో మిగిలారని, ఫలితంగా 17 స్థానాల్లో వైసీపీకి అసలు పోటీయే లేకుండా పోయిందని స్పష్టం చేశారు.

యువతకు ప్రాధాన్యం

తాను ముందుగా చెప్పినట్టుగానే జెన్ జీ (Gen Z) యువతకు స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 44వ డివిజన్ నుంచి పోటీ చేసిన భీమినేని వేద శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం తమ హయాంలో యువతకు దక్కిన గుర్తింపునకు నిదర్శనమని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.

Also Read: అంతా డూప్‌తో బతకడమే వైసీపీ స్టైల్: ఆదినారాయణ రెడ్డి

Tags

Related News

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

అంతా డూప్‌తో బతకడమే వైసీపీ స్టైల్: ఆదినారాయణ రెడ్డి

చంద్రబాబు పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. రాజీనామా చేయాలంటూ ధర్మాన డిమాండ్

జగన్‌లాంటి వారు రాజకీయాలకే ప్రమాదం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మీది ఆరాటం.. మాది పోరాటం.. ఎన్నికల తీరుపై వైకాపా నేతల ఆగ్రహం!

చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

Big Stories

Advertisement
×