Killer Movie: ప్రతి వారం ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి అయితే సినిమాల పట్ల మంచి బజ్ క్రియేట్ చేయడం కోసం దర్శక నిర్మాతలు లేదా హీరో హీరోయిన్లు ప్రేక్షకులకు పెద్ద ఎత్తున సవాల్ విసురుతూ ఉంటారు. సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వదిలేస్తానని, నడిరోడ్డుపై తిరుగుతాను అంటూ ఇలా ఎన్నో రకాల చాలెంజ్ లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా దర్శకుడు సుకు పూర్వజ్(Suku Purvaj) మాత్రం చాలా భిన్నంగా ఆలోచించారు. ఈయన దర్శకత్వంలో త్వరలో కిల్లర్ (Killer)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి మేడంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జ్యోతి (Jyothi) తన భర్త సుకు పూర్వజ్ దర్శకత్వంలో నటించిన కిల్లర్ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కిల్లర్ సినిమా ఇంటర్వెల్ సమయంలో ఒక ట్విస్ట్ రాబోతోందని, ఇందులో ఉన్న ట్విస్ట్ గుర్తిస్తే వారికి కోటి రూపాయలు ఇస్తాము అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.
నేను అందరిలాగా స్టేజ్ మీద కాలరు ఎగరేయడం తొడగొట్టడం లాంటివి చేయను అంటూ కోటి రూపాయలకు సంబంధించిన చెక్ తీసుకువచ్చారు. ఈనెల 29 రాత్రి లేదా 30న సినిమా ఫస్ట్ షో ప్రీమియర్స్ పడతాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా తాము ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తామని, ఈ సినిమా ఇంటర్వెల్ పడిన ఐదు నిమిషాలలోపు ఒక ట్విస్ట్ ఉంటుందని అది కనిపెట్టి వాట్సప్ నెంబర్ కు పంపిస్తే చాలు సరైన సమాధానం చెప్పిన వారికి ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయల చెక్ అందజేస్తానని డైరెక్టర్ సుకు పూర్వజ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సూపర్ షీ అనే ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా మీకు రాత్రికి రాత్రే సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు మహిళలు చెప్పిన సమాధానాలలో భాగంగా బెస్ట్ ఆన్సర్ అనిపించిన పదిమంది మహిళలను ఎంపిక చేసామని ఈ పదిమందికి కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఒక్కొక్కరికి 1.4 లక్షల రూపాయలు చొప్పున అందజేస్తామని ఈయన తెలియచేశారు. ఇలా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా చేయని ఛాలెంజ్ సుకు పూర్వజ్ చేశారని ఈయన కామెంట్స్ తో ఒక్కసారిగా సినిమాపై భారీ బజ్ ఏర్పడిందని చెప్పాలి. మరి ఆ కోటి రూపాయలు ఎవరు గెలుచుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై మిథిలేష్ కామెంట్స్ విన్నారా? అలాంటి వారంటే ఇష్టమంటూ!