E-Paper
Advertisement

అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై మిథిలేష్ కామెంట్స్ విన్నారా? అలాంటి వారంటే ఇష్టమంటూ!

అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై మిథిలేష్ కామెంట్స్ విన్నారా? అలాంటి వారంటే ఇష్టమంటూ!
Advertisement

Big Tv Kissik Talks: మిథిలేష్ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో భాగంగా ఎంతోమంది కంటెస్టెంట్లు పాల్గొంటూ సందడి చేస్తున్నారు అయితే గత కొన్ని సీజన్లుగా ఈ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా పలువురిని ఎంపిక చేస్తూ హౌస్ లోకి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో మిథిలేష్ (Mithilesh)ఒకరు.

అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి మిథిలేష్..

మిథిలేష్ అగ్నిపరీక్ష కార్యక్రమంలో ఎంపిక అవుతూ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. అయితే ఈయన హౌస్ లో ఉన్నది కేవలం రెండు రోజులే అని చెప్పాలి. బిగ్ బాస్ కంటెంట్ల ముందు 15 లక్షల రూపాయల సూట్ కేస్ ఉంచి దీనిని తీసుకొని వెంటనే హౌస్ నుంచి బయటకు రావాలనుకునే వారు ఎలిమినేట్ కావచ్చు అంటూ ఆఫర్ ఇవ్వడంతో ఊహించని విధంగా మిథిలేష్ ఈ ఆఫర్ ఉపయోగించుకుంటూ 15 లక్షల రూపాయలతో హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా మితిలేష్ ఇలాంటి పని చేయడంతో రాత్రికి రాత్రే సంచలనంగా మారారు. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని సాహసం మిథిలేష్ చేశారు.

ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు..

Advertisement

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయిన మిథిలేష్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు ఈ నేపథ్యంలోనే అమ్మాయిల వస్త్రధారణ గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ వివాదాలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథిలేష్ ను వర్షా ప్రశ్నిస్తూ అమ్మాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నచ్చుతారు అంటూ ప్రశ్న ఎదురయింది..

Advertisement

ఈ ప్రశ్నకు మిథిలేష్ సమాధానం చెబుతూ.. అమ్మాయిలు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అంటూ సమాధానం చెప్పారు. మరి మీకు అమ్మాయిలు ఎలా ఉంటే ఇష్టం అనే ప్రశ్న అడగడంతో తనుకు చీర కట్టుకునే అమ్మాయిలు అంటే చాలా ఇష్టమని తన మనసులో మాటను బయటపెట్టారు. ఇలా మిథిలేష్ చాలా ట్రెడిషనల్ గా సంప్రదాయపదంగా ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టమని చెప్పడంతో ఒకసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన లవ్ బ్రేకప్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. బీటెక్ లో ఉన్నప్పుడు బ్రేకప్ అయిందని ప్రస్తుతం తాను సింగిల్ అని తెలిపారు.

Also Read: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై మిథిలేష్ కామెంట్స్.. లెజెండ్స్ అని ఊరికే అనరుగా?

Related News

మధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్..కమ్‌బ్యాక్ అదిరిపోయిందిగా!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పై మిథిలేష్ కామెంట్స్.. లెజెండ్స్ అని ఊరికే అనరుగా?

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్.. గుట్టు రట్టు చేసిన మిథిలేష్!

ప్రేమ, పెళ్లిపై మిథిలేష్ కామెంట్స్.. బాబుకి పెద్ద కోరికలే!

అగ్ని పరీక్ష పై మిథిలేష్ కామెంట్స్.. బిగ్ బాస్ తరువాతే టెలికాస్ట్ చేయాలంటూ!

డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!

మీ ఇంట్లో డబ్బు తీసుకెళ్లానా?రూ.15 లక్షల ట్రోల్స్ పై మిథిలేష్ షాకింగ్ రియాక్షన్!

Big Stories

Advertisement
×