E-Paper
Advertisement

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?
Advertisement
Elon Musk: భారత్‌లో స్టార్‌ లింక్‌  నెట్‌వర్క్‌ ను కొందరు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ పోస్టులతో ఎక్స్‌ వేదికగా దుమ్మెత్తిపోశారు. కట్‌ చేస్తే ఉక్రెయిన్‌ విషయంలో మస్క్‌ వైఖరిపై ఇప్పుడు చర్చగా రచ్చగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పుడు మస్క్‌ పెద్ద మనసు చాటుకున్నాడు. ఉక్రెయిన్‌కు  స్టార్‌ లింక్‌ సేవలందించాడు. కానీ సడెన్‌గా సీను మారింది. వార్‌ ఫీల్డ్‌ లో ఉక్రెయిన్  డ్రోన్ల వేగం తగ్గింది. స్టార్‌ లింక్‌ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌పై ఎలాన్‌ మస్క్‌ నియంత్రణ విధించడమే అందుకు కారణమనే ప్రచారం తెరపైకి వచ్చింది.

రష్యాతో డిజీల్‌ డీల్‌..

నేనున్నానని పెద్దన్నగా ఒకప్పుడు ఉక్రెయిన్‌కు భరోసా వాఖ్యమిచ్చిన ట్రంప్‌.. ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా రష్యాతో డిజీల్‌ డీల్‌ కుదుర్చుకున్నారు.  ఆ క్రమంలోనే స్టార్‌ లింక్‌  సేవలు క్రమక్రమంగా తగ్గడంతో ఉక్రెయిన్‌లో ఆందోళన మొదలైంది. ట్రంప్‌- పుతిన్‌ డీజిల్‌ దోస్తీ..అదే బాటలో  ఎలాన్‌ మస్క్‌ కూడా స్టార్‌ లింక్‌ నెట్‌ వర్క్‌ పై ఆంక్షలు విధించారనే అనుమానాలు తలెత్తాయి. ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఈ అంశంపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు.

స్టార్‌ లింక్స్‌..

ఉక్రెయిన్‌లో ఆంక్షలు విధించింది స్టార్‌ షీల్డ్‌పైన.. స్టార్‌ లింక్స్‌ పైన కాదన్నారు. స్టార్‌ లింక్‌.. స్టార్‌ షీల్డ్‌.. రెండూ ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ పరిధిలోనివే. రెండింటికి ఆధారం ఒకే శాటిలైట్‌. స్టార్‌ లింక్స్‌.. కమర్షియల్‌ ఇంటర్నెట్‌ వ్యవస్థ. స్టార్‌ షీల్డ్‌ కేవలం సైనిక అవసరాల కోసం వినియోగించేది. స్టార్‌ లింక్స్‌ నియంత్రణ స్సేప్‌ ఎక్స్‌ పరిధిలో ఉంది. స్టార్‌ షీల్డ్‌ నియంత్రణ అమెరికా చేతిలో ఉందనేది మస్క్‌ వెర్షన్‌.

స్టార్‌ షీల్డ్‌ పై ఆంక్షలు..

ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా  ఉక్రెయిన్‌లో స్టార్‌ షీల్డ్‌ పై ఆంక్షలు విధించారన్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌ స్కీ. ట్రంప్‌-పుతిన్‌  డీల్‌ తరువాత ఈ పరిణామం జరగడంపై ఉక్రెయిన్‌లో ఆందోళన పెరిగింది. ఎవరేమనుకుంటే మాకేంటి… స్టార్‌ షీల్డ్‌ పై ఆంక్షలు మా పరిధిలోకి రాదు.అది ట్రంప్‌ చేతిలో వుందని కప్పదాటు కథలు చెప్పేశారు మస్క్‌. అంతటితో ఆగలేదు. ఉక్రెయిన్‌ కు స్టార్‌ లింక్‌ సేవలు అందించాలనే రూలేంలేదు. వార్‌ ఫీల్డ్‌లో సేవలందించడం ఎంతో రిస్క్‌. పైగా పైసా వచ్చేది ఉండదు. ఐనా సరే ఉక్రెయిన్‌కు మా నెట్‌ వర్క్‌ను ఇచ్చాం. అది ఆలోచించండి. స్టార్‌ షీల్డ్‌పై అమెరికా చేతిలో ఉంటుంది. ఎందుకు కంట్రోల్‌ బటన్‌ నొక్కారో ట్రంప్‌ను అడగాలి.  అంతేగానీ మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎలా అని నెట్‌జన్ల ప్రశ్నలకు బదులిచ్చారు ఎలాన్‌ మస్క్‌. ఎలాన్‌ మస్క్‌ ఎలాంటో  అర్ధమవుతోందా?..పక్కా ఫక్తు బిజినెస్‌ మైండ్‌…అంటూ సోషల్‌ మీడియాలో  కామెంట్లు పోటెత్తుతున్నాయి.
Tags

Related News

సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!

చెన్నైలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోయిన తాగు నీటి నిల్వలు!

జంతర్ మంతర్‌ వ్యవహారం.. కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!

మత మార్పిడి రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి నో బీసీ కోటా

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

Big Stories

Advertisement
×