E-Paper
Advertisement

మావిగన్ అసలు అర్థం.. మామిడిపంటకు వచ్చే తెగులట.. జగన్ మళ్లీ బుక్కయ్యారా..?

మావిగన్ అసలు అర్థం.. మామిడిపంటకు వచ్చే తెగులట.. జగన్ మళ్లీ బుక్కయ్యారా..?
Advertisement

Mavigun Controversy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ (MAVIGUN) రాజధాని ప్రతిపాదన.. ప్రస్తుతం ఏపీలో తీవ్రచర్చకు కారణమైంది. అమరావతికి బదులు ప్లాన్-బి కింద.. మచిలిపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) కలుపుతూ మరో రాజధానిని జగన్ ప్రతిపాదించారు. దీంతో సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు, శ్రేణులు, నెటిజన్లు జగన్ వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే జగన్ వాడిన ‘మావిగన్’ పదానికి అసలు అర్థం.. మామిడిపంటకు వచ్చే తెగులంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. పంట తెగులు పేరును రాజధానికి పెడతావా? అంటూ మళ్లీ జగన్ పై ఫైర్ అవుతున్నారు. ఇందులో నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

మావిగన్ తెగులా? కాదా?

వాస్తవానికి మావిగన్ అంటే మామిడికి పంటకు వచ్చే తెగులు కాదు. అసలు ఆ పేరుతో తెగులే లేదు. అయితే మాగున్ (Sooty Mould) పేరుతో.. మామిడికి వచ్చే తెగులు ఒకటి ఉంది. అది పలకడానికి మావిగన్ కు దగ్గరగా ఉండటంతో అందరూ దీనినే మామిడి తెగులుగా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మాగున్ తెగులు.. తేనెమంచు పురుగులు (Hoppers) ద్వారా వస్తుంది. ఈ పురుగులు.. మామిడి ఆకులు, పూత, పిందెలపై నల్లటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ జిగురుపై ‘క్యాప్నోడియం’ అనే శిలీంధ్రం (Fungus) చేరి నల్లటి మసి లాగా వ్యాపిస్తుంది. కాయల పైన నల్లటి మచ్చలు ఉండటం వల్ల మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఇష్టపడరు.

మావిగన్‌కు దగ్గరగా మరో తెగులు!

Advertisement

మాగున్ తరహాలోనే మావిగన్ పదానికి దగ్గరగా మరో తెగులు కూడా ఉంది. దాని పేరే ‘మావి కన్ను’ (Anthracnose). ఈ తెగులు కొలెటోట్రికమ్ గ్లోయియోస్పోరియాడ్స్ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది కూడా ఆకులపై చిన్న చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ శీలింధ్రం ఆకుల్లోని సారం మెుత్తాన్ని పీల్చేసి.. త్వరగా ఎండిపోయేలా చేస్తుంది. పూత దశలో ఈ తెగులు సోకితే, పూత మొత్తం నల్లగా మారి మాడిపోతుందని రైతులు చెబుతుంటారు. మెుత్తంగా జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలకు.. ఈ తెగుల పేర్లు దగ్గరగా ఉండటంతో దాని అస్సలు అర్థం ఇదేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

Also Read: JAGAN : అమరావతిపై వెనక్కి తగ్గిన జగన్?.. అందుకోసమేనా?

అమరావతి ఇష్టంలేదా?

Advertisement

ఇదిలాఉంటే వైసీపీ అధినేత జగన్ కి అమరావతి రాజధాని అంశంలో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2014-19 ప్రాంతంలో ఏపీ అసెంబ్లీలో అమరావతిని సమర్థించిన జగన్.. తాను అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అమరావతికి చట్టబద్దత తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో అది నచ్చని జగన్.. ఇలా అర్థం లేకుండా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మెుత్తం మీద అమరావతి విషయంలో జగన్ చిత్తశుద్ధి ఏంటో మరోమారు తేటతెల్లం అయ్యిందని కూటమి ప్రభుత్వ నేతలు పేర్కొంటున్నారు.

Also Read: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. హ్యాకర్ల కన్ను మీ ఫోన్ పైనే, అసలు ఏమిటీ మాల్వేర్?

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×