E-Paper
Advertisement

సలాడ్ తినడానికి బెస్ట్ టైం ఏది ?

సలాడ్ తినడానికి బెస్ట్ టైం ఏది ?
Advertisement

Perfect Times To Eat Salads: ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవారు తమ డైట్‌లో సలాడ్స్‌ను తప్పనిసరిగా భాగంగా చేసుకుంటారు. పచ్చి కూరగాయలు, పండ్లు, గింజలు, మొలకలతో తయారు చేసిన సలాడ్స్ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు , పీచు పదార్థాన్ని పుష్కలంగా అందిస్తాయి. అయితే.. సలాడ్స్ ఆరోగ్యకరమైనవి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. సలాడ్స్ తీసుకోవడానికి కొన్ని ఖచ్చితమైన సమయాలు ఉన్నాయి.సరైన సమయంలో వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. ఇంతకీ సలాడ్ తినడానికి ఏది ఫర్ఫెక్ట్ టైం అనే విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సలాడ్స్ తినడానికి సరైన సమయాలు:
సలాడ్స్‌ను కేవలం ఒక సైడ్ డిష్‌గా కాకుండా.. ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే అవి మీ శరీరానికి అద్భుతమైన పోషకాలను అందిస్తాయి.

Advertisement

1. భోజనానికి ముందు:
సలాడ్స్ తినడానికి అత్యంత అనువైన సమయం భోజనానికి 20 నుండిచి 30 నిమిషాల ముందు. దీనివల్ల కలిగే ఉపయోగాలు..

బరువు తగ్గడం : భోజనానికి ముందు సలాడ్ తినడం వల్ల అందులోని ఫైబర్ మీ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీని వల్ల మీరు ప్రధాన భోజనంలో కేలరీలు తక్కువగా తీసుకుంటారు.

Advertisement

బ్లడ్ షుగర్ నియంత్రణ: కూరగాయల్లోని పీచు పదార్థం కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారే వేగాన్ని తగ్గిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.

జీర్ణ ఎంజైములు: పచ్చి కూరగాయల్లో ఉండే ఎంజైములు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.

2. మధ్యాహ్నం భోజనం:
మధ్యాహ్నం సమయంలో మన జీర్ణ వ్యవస్థ అత్యంత చురుగ్గా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువ భోజనానికి బదులుగా ప్రొటీన్లు (పనీర్, శనగలు, గుడ్లు లేదా చికెన్) కలిపిన సలాడ్‌ను ప్రధాన ఆహారంగా తీసుకోవచ్చు. ఇది మధ్యాహ్నం వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

3. సాయంత్రం స్నాక్ సమయం:
చాలా మంది సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో సమోసాలు లేదా చిప్స్ వంటి జంక్ ఫుడ్ తింటుంటారు. వాటికి బదులుగా ఒక కప్పు దోసకాయ, క్యారెట్ లేదా మొలకల సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది రాత్రి భోజనం వరకు ఆకలిని అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా అనవసరపు కేలరీలను నివారిస్తుంది.

4. వ్యాయామం తర్వాత :
వర్కవుట్ చేసిన తర్వాత శరీరానికి పోషకాలు చాలా అవసరం. పండ్లు, నట్స్ , పెరుగు కలిపిన సలాడ్ తీసుకోవడం వల్ల అలసిపోయిన కండరాలకు శక్తి అందుతుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

Also Read: యోగాతో కోపానికి చెక్.. ఈ సింపుల్ ఆసనాలతో బోలెడు బెనిఫిట్స్

సలాడ్స్ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:
రాత్రి పూట నివారించడం మేలు: రాత్రి పడుకోవడానికి ముందు పచ్చి కూరగాయల సలాడ్స్ తినకపోవడమే మంచిది. పచ్చి కూరగాయల్లో ఉండే ‘సెల్యులోజ్’ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల రాత్రి పూట గ్యాస్, ఉబ్బరం లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్త: సలాడ్స్‌లో ఎక్కువ మొత్తంలో మయోనైజ్, క్రీమ్ లేదా చీజ్ వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. వాటికి బదులుగా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, కొద్దిగా మిరియాల పొడి లేదా సైంధవ లవణం వాడండి.

శుభ్రత ముఖ్యం: పచ్చి కూరగాయలను వాడే ముందు వాటిని ఉప్పు నీటితో లేదా వెనిగర్‌తో బాగా కడగాలి. దీని వల్ల వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు , బ్యాక్టీరియా నశిస్తాయి.

సలాడ్స్ అనేవి ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ గుణాలు గల ఆహారం. భోజనానికి ముందు లేదా మధ్యాహ్న సమయంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడటమే కాకుండా.. చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే.. మీ శరీర తత్వాన్ని బట్టి రాత్రి పూట పచ్చి ఆహారాన్ని తినకుండా ఉండండి. అంతే కాకుండా పగటి పూట సలాడ్స్‌ను ఎంజాయ్ చేయడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×