AC tips :ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నా ఎంత స్పీడ్ గా తిరిగినా కరెంట్ బిల్ పెరగడం తప్ప చల్లదనం అనేది శూన్యం. సూరీడి ఫైర్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి.అందుకే చాలా మంది ఏసీ ఉంటె ఎలా ఉంటుంది అంటూ షో రూమ్ లవైపు ఓ లుక్కేస్తారు. అయితే మనం వెళ్ళగానే ఎదో ఒక ఏసీ మనకు అంటగట్టేందుకు సేల్స్ మెన్ రెడీ గా ఉంటాడు. అందులో భాగంగా ఆఫర్లంటూ, డిస్కౌంట్స్ అంటూ మనల్ని ఫుల్ కన్ఫ్యూజన్ చేస్తుంటారు. మరి మీ ఇంటికి కావాల్సిన ఓ పర్ఫెక్ట్ ఏసీ ని ఎలా పట్టేయ్యాలో తెలుసుకోండి ఇలా !
చాలా మంది ac కొంటున్నారంటే చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా ..ఉండేది చిన్న రూమే కదా అని 0.8 టన్ సరిపోతుంది అని కెపాసిటీ తక్కువ ఉన్నది తీసుకుంటారు, ఆ తర్వాత చిక్కుల్లో పడతారు. అవును ..రూమ్ చిన్నగానే ఉండొచ్చు కానీ ఆ రూమ్ లో జనం ఎక్కువగా ఉన్నా, లేదా ఎండలు సరాసరి ఆ గోడలకి తగిలేలా ఉన్నా ఆ ఏసీ అస్సలు సరిపోదు. అందుకే మీ రూమ్ గనుక 100 చదరపు అడుగుల లోపు ఉంటే 1 టన్, 150 అడుగుల వరకు ఉంటే 1.5 టన్ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ గది టాప్ ఫ్లోర్‌లో ఉండి, పైన డైరెక్ట్ ఎండ పడుతుంటే మాత్రం ఖచ్చితంగా అర టన్ను ఎక్కువే తీసుకోవాల్సిందే. అంటే 1.5 టన్ స్థానంలో 2 టన్ ఏసీ అన్న మాట. అలా అయితేనే ac పెటుకున్న మజా వస్తుంది.
5 స్టార్ ఏసీ పర్ఫెక్ట్ బాస్ ..
ఇక కరెంట్ బిల్లుని డిసైడ్ చేసేది స్టార్ రేటింగ్.3 స్టార్ ఏసీ చీఫ్ గా కనిపించొచ్చు. ఏదైనా ac ఏ గా అని వెంటనే కమిట్ అయిపోకండి. 5 స్టార్ ఏసీ తీసుకునేందుకు ట్రై చేయండి. రేటు ఎక్కువైనా కరెంట్ బిల్ ని కంట్రోల్ లో పెట్టేస్తుంది. ఇక మీరు రోజుకు 8 నుండి 10 గంటలు ఏసీ వాడే వారైతే మాత్రం 5 స్టార్ ఏసీ కోసం పెట్టిన ఎక్కువ ఖర్చు కరెంట్ బిల్ రూపంలో కవర్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఏసీని చాలా తక్కువ అంటే రోజుకు 2-3 గంటలు మాత్రమే వాడతారనుకుంటే మాత్రం 3 స్టార్ ఏసీ తీసుకోవడం ఉత్తమం.
‘ఇన్వర్టర్ ఏసీ ఇంపార్టెంట్ గురూ ..
ఇక అన్నింటి కన్నా ముఖ్యం ‘ఇన్వర్టర్ ఏసీ’. పాత ఏసీల విషయానికి వస్తే గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోయి, మళ్ళీ వేడెక్కగానే పెద్ద శబ్దంతో స్టార్ట్ అయ్యేది. దీనివల్ల కరెంటు ఎక్కువ మొత్తం లో కన్జ్యూమ్ అయ్యేది. అదే ఇన్వర్టర్ ఏసీలలో కంప్రెసర్ ఎప్పుడూ ఆగిపోదు, నీడ్ బట్టి దాని స్పీడ్‌ను తగ్గించుకుంటూ రూమ్ టెంపరేచర్ ని ఒకేలా ఉంచుతుంది. దీనివల్ల కరెంటు సేవ్ అవ్వడమే కాదండోయ్, ఏసీ వర్కింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. అంటే ఇన్వర్టర్ ఏసీలు లాంగ్ రన్‌లో ఫ్రాఫిటబుల్ అన్న మాట.
కేర్ ఫుల్ విత్ ‘కండెన్సర్ కాయిల్’
ఇక మరో ముఖ్యమైన విషయం .. ‘కండెన్సర్ కాయిల్’.మాములుగా మార్కెట్‌లో తక్కువ ధరకు వచ్చే ఏసీల్లో అల్యూమినియం కాయిల్స్ వాడుతుంటారు. ఇవి త్వరగా తుప్పు పడతాయి (Corrosion), గ్యాస్ లీకేజీ సమస్యలు వస్తాయి. అదే 100% కాపర్ కాయిల్ అయితే లైఫ్ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా రాగి కాయిల్‌ను రిపేర్ చేయడం చాలా ఈజీ.అదే అల్యూమినియం కాయిల్ చెడిపోతే మాత్రం
మొత్తం మార్చాల్సిందే.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్
ఇక చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ..’సర్వీస్’.కొత్త ac కొన్నప్పుడు బానే ఉంటుంది. కానీ, సమ్మర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏసీ ఫిల్టర్లు క్లీన్ చేయాలన్నా లేదా ఏదైనా రిపేర్ వచ్చినా కంపెనీ వాళ్లు వెంటనే రియాక్ట్ అవ్వాలి . అప్పుడే మన ac కి వాల్యూ.సో తొందరపడకుండా మీ ఏరియాలో ఏ బ్రాండ్ సర్వీస్ నెట్‌వర్క్ బాగుందో ఆరాలు తీయండి .వారంటీ విషయంలో కూడా కంప్రెసర్‌కు 10 ఏళ్లు, పీసీబీ (PCB) కి 5 ఏళ్లు వారంటీ ఇచ్చే బ్రాండ్లకే ఇంపార్టెన్స్ ఇవ్వండి . అర్థమైందా …సరైన ac ని ఎలా పట్టేయ్యాలో !
also read:‘డ్రగ్’ వార్…..టాలీవుడ్ vs పొలిటీషియన్స్