E-Paper
Advertisement

ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. హ్యాకర్ల కన్ను మీ ఫోన్ పైనే, అసలు ఏమిటీ మాల్వేర్?

ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. హ్యాకర్ల కన్ను మీ ఫోన్ పైనే, అసలు ఏమిటీ మాల్వేర్?
Advertisement

Android Security: ప్రస్తుత ఈ టెక్ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యువత చేతిలో ఫోన్ లేనిదే రోజు గడవదు అన్నట్టుగా వాడుతుంటారు. అంతలా మన జీవితం ఫోన్‌తో ముడిపడిపోయింది. అయితే, మనకు తెలియకుండానే మన ఫోన్లోకి మాల్వేర్ అనే ఒక వైరస్ చొరబడే అవకాశం ఉంది. ఇది కేవలం ఫోన్‌ను పాడు చేయడమే కాదు.. మన వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని కూడా దొంగిలిస్తుంది. అసలు ఈ మాల్వేర్ గొడవ ఏంటి? ఇది మన ఫోన్లోకి ఎలా వస్తుంది? వస్తే ఎలా కనిపెట్టాలి? అనే విషయాలను ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

మాల్వేర్ అంటే?

మాల్వేర్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక హానికరమైన సాఫ్ట్‌వేర్. మీ ఫోన్లో ఉంటూ మీకే తెలియకుండా మీ డేటాను వేరే వాళ్లకు పంపడం దీని పని. ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం ప్లే స్టోర్ కాకుండా, గూగుల్‌లో దొరికే రకరకాల వెబ్‌సైట్ల నుండి ఏవో యాప్‌లు (APK ఫైల్స్) డౌన్‌లోడ్ చేస్తూ ఉంటాం. అప్పుడే ఈ మాల్వేర్ దొంగచాటుగా ఫోన్లోకి వచ్చేస్తుంది. అందుకే అపరిచిత వెబ్‌సైట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.

Advertisement

Also Read: ధర తక్కువే కానీ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. Redmi A7 Proలో గూగుల్ AI ఫీచర్లు కూడా!

ఈ వైరస్‌ను ఎలా గుర్తించాలి?

ఈ మాల్వేర్ గనుక మీ ఫోన్‌లో ఉంటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఫోన్ అకస్మాత్తుగా స్లో అయిపోయినా, వాడకపోయినా వేడెక్కిపోతున్నా అనుమానించాల్సిందే. అలాగే బ్యాటరీ మునుపటి కంటే చాలా వేగంగా అయిపోతుంటే లోపల ఏదో జరుగుతోందని అర్థం. అప్పుడప్పుడు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ లిస్ట్ చెక్ చేయండి. మీకు తెలియని పేరుతోనో లేదా వింత వింత బొమ్మలతోనో ఏదైనా యాప్ కనిపిస్తే అది మాల్వేర్ అయ్యే అవకాశం ఉంది.

ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే?

Advertisement

ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆన్ ఉందో లేదో చూసుకోండి. వీలైతే ప్లే స్టోర్ నుండి ఒక మంచి యాంటీ వైరస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుమానం ఉన్న యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అడిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా అప్‌డేట్ చేయండి. ఒకవేళ పరిస్థితి చేజారిపోయింది అనిపిస్తే.. ఫోన్‌లోని ముఖ్యమైన ఫొటోలు, నంబర్లు బ్యాకప్ తీసుకుని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేసేయండి. దీనివల్ల ఫోన్ మళ్లీ క్లీన్ అయిపోతుంది. మన జాగ్రత్తలో మనం ఉంటే ఈ హ్యాకర్ల భయం ఉండదు.

Also Read: 8,000mAh బ్యాటరీ, అదిరిపోయే కూలింగ్ ఫ్యాన్‌తో ‘Oppo K15 Pro’ సిరీస్ లాంచ్!

Related News

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

Big Stories

Advertisement
×