E-Paper
Advertisement

ప్రొ. నాగేశ్వరరావుకు నాగబాబు కౌంటర్.. వ్యక్తిత్వ హననమా? విశ్లేషణ పేరుతో తప్పుడు ప్రచారమా?

ప్రొ. నాగేశ్వరరావుకు నాగబాబు కౌంటర్.. వ్యక్తిత్వ హననమా? విశ్లేషణ పేరుతో తప్పుడు ప్రచారమా?
Advertisement

Amaravati: ఏపీలో కూటమిని విడగొట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయా? విశ్లేషకులు-ప్రొఫెసర్ నాగేశ్వరరావు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయా? ఇంతకీ నాగేశ్వరరావు ఎప్పుడు డిబేట్‌లో ఆ విషయాలు ప్రస్తావించారు? పాత వీడియోలను తీసుకొచ్చి కొందరు వ్యక్తులు వైరల్ చేస్తున్నారా? గురువారం ఏపీ వ్యాప్తంగా చర్చ జరగడంతో జనసేన రియాక్ట్ అయ్యింది. ప్రొ. నాగేశ్వరరావు చేసిన మాటలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రియాక్ట్ అయ్యారు.

ప్రొ. నాగేశ్వరరావుకు నాగబాబు కౌంటర్

Advertisement

ఏపీ రాజకీయాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రియాక్ట్ అయ్యారు. ప్రొ. నాగేశ్వరరావు మంచి వ్యక్తి అని చెబుతూ.. జ్ఞానం, వామపక్ష భావాలున్న వ్యక్తి అని అన్నారు. బీజేపీ, జనసేనను విమర్శించినా తాము తప్పుగా ఫీల్ అయ్యేవారం కామన్నారు. తాము ఆలోచించే విధానం వేరు.. ఆయన ఆలోచనా విధానం వేరన్నారు.

ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉండవచ్చని, అంత మాత్రాన ఆయన క్యారెక్టర్, జ్ఞానాన్ని ఏ మాత్రం శంకించలేదన్నారు. అలాంటి వ్యక్తి.. అవినీతి పార్టీ అనుకూలంగా మాట్లాడుతున్నారని అనిపించినా, దానిపై తాము విమర్శలు చేయలేదని అన్నారు. విమర్శల నుంచి మంచి పాయింట్ ఉంటే తీసుకుంటామన్నారు.

Advertisement

వీలుంటే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని నాగబాబు సూచన

ఈ మధ్యకాలంలో ఆయన లాంటి వ్యక్తి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు పవన్ కల్యాణ్-నాదెండ్ల మనోహర్ వెళ్లి, జగన్‌ను అరెస్టు చేయాలంటూ మాట్లాడారని, అందుకు అమిత్ షా ఒప్పుకోలేదని చెప్పడం దారుణమన్నారు. అలాంటి మాటలు మీ నోటి నుంచి రావడం సరికాదన్నారు. ఇలాంటి మాటలు వేరేవాళ్లు అంటే పట్టించుకోమని, మీలాంటి జ్ఞాన వంతులు అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

మీరు సీక్రెట్ యూట్యూబర్ మాదిరిగా, సరైన అవగాహన, సమాచారం లేకుండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నలు రైజ్ చేశారు. వామపక్ష భావాలున్నవారు విమర్శలు చేస్తారని సహజంగానే అనుకున్నామని అన్నారు. కల్యాణ్-అమిత్ షా క్యారెక్టర్లు వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయన్నారు. మీ నోటి నుంచి ఆ మాటలు ఎలా వచ్చాయన్నారు.

ALSO READ: గొడ్డలి పార్టీ ఇష్యూ.. సీఎం చంద్రబాబుపై జగన్ ఎదురుదాడి, మా తాత, నాన్న, చిన్నాన్న ఏం చేశారు?

మీకు అమిత్ షా అంటే పడకపోవచ్చు, జగన్ లాంటి అవినీతి పరుడు మాకు అవసరమని ఆయన అన్నారా? మీరు విన్నారా? ప్రొ. నాగేశ్వరరావు ప్యాకేజ్ కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని వింటుంటే తనకు బాధ అనిపించిందన్నారు. ఈ విషయంలో మీరు బయటకు వచ్చి సరిదిద్దుకోవాలన్నారు. నాగేశ్వరరావు.. మీరు పెద్దవారని, కుదిరితే మీ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు నాగబాబు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×