E-Paper
Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌పై ప్రియాంకా చోప్రా క్రేజీ రియాక్షన్!.. ‘ఫైర్’ అంటూ.

రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌పై ప్రియాంకా చోప్రా క్రేజీ రియాక్షన్!.. ‘ఫైర్’ అంటూ.
Advertisement

Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ విజువల్ వండర్, సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ట్రైలర్‌పై గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జానస్ స్పందిస్తూ చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తేశారు.

Read also-పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య ?

Advertisement

తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ‘పెద్ది’ ట్రైలర్‌ను షేర్ చేసిన ప్రియాంక.. “ఫైర్! (Fire!) రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, దర్శకుడు బుచ్చిబాబు సన, చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

గతంలో రామ్ చరణ్ టాలీవుడ్ ఎంట్రీ బాలీవుడ్ మూవీ ‘తుఫాన్’ (జంజీర్) లో ప్రియాంకా చోప్రానే హీరోయిన్‌గా నటించారు. ఆ పరిచయం చరణ్‌తో ఉన్న మంచి అనుబంధంతోనే ఆమె ప్రత్యేకంగా ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ మేకోవర్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఒక అథ్లెట్, కుస్తీ యోధుడు, క్రికెటర్‌గా చరణ్ చూపించిన ట్రాన్స్‌ఫార్మేషన్ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.

Advertisement

Read also-Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ను రెచ్చగొట్టిన శ్రీయ.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. పల్లవి ప్లాన్ సక్సెస్..

ప్రియాంక గ్రాండ్ ఎంట్రీ!

ఇదిలా ఉంటే, ప్రియాంకా చోప్రా త్వరలోనే నేరుగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుతోనే ఆమె మళ్లీ భారతీయ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4, 2026న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ప్రియాంక ట్వీట్‌తో ఈ సినిమాకు నేషనల్ వైడ్ మరింత క్రేజ్ లభించిందని చెప్పొచ్చు.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×