E-Paper
Advertisement

Amaravati: గొడ్డలి పార్టీ ఇష్యూ.. సీఎం చంద్రబాబుపై జగన్ ఎదురుదాడి, మా తాత, నాన్న, చిన్నాన్న ఏం చేశారు?

Amaravati: గొడ్డలి పార్టీ ఇష్యూ.. సీఎం చంద్రబాబుపై జగన్ ఎదురుదాడి, మా తాత, నాన్న, చిన్నాన్న  ఏం చేశారు?
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? రానున్న రోజుల్లో హత్యల చుట్టూ కొత్త రాజకీయాలు రానున్నాయా? ఉన్నట్లుండి జగన్ పాత అంశాలపై తెరపైకి ఎందుకు తెచ్చారు? ప్రజల్లో తనపై సింపతీ క్రియేట్ చేసే పనిలో పడ్డారా? తనను తాను మంచోడ్ని అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన జగన్

Advertisement

సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చీటికి మాటికి వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. అంతేకాదు పాత అంశాలపై తెరపైకి తెచ్చి మా ఫ్యామిలీలో జరిగిన పాత ఘటనలకు టీడీపీ రంగు పులుమే ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాల సంస్కృతి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లే కదా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. వైఎస్ఆర్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేయాలనేది ఆయన పథకంగా వర్ణించారు.

Advertisement

మా తాత..  నాన్న..  చిన్నాన్న ఏం చేశారు? అంటూ జగన్ ఎదురుదాడి

ఆ కేసుల్లో దోషుల్ని టీడీపీ ఆఫీసులో దాయలేదా? అధికారం దుర్వినియోగం చేసి వాళ్లని రక్షించిందెవరు?  ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అంటూ ప్రశ్నించారు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని నరికి చంపిన వాళ్ళు ఇవాళ్టికీ బతికే ఉన్నారని అన్నారు. ఒకవేళ జగన్ చెడ్డోడయితే వాళ్ళంతా బతికి ఉండేవారా? అంటూ నిలదీశారు.

వైఎస్ఆర్ హెలికాప్టర్ ఘటనను టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారు జగన్. నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని సీఎం చంద్రబాబు మాట్లాడిన రెండు లేదా మూడు రోజులకే మా నాన్న(వైఎస్ఆర్) హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని వివరించారు. దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మా చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్యకు గురైందని వాస్తవం కాదా? అంటూ నిలదీశారు.

ALSO READ:  సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్.. మరోసారి చావు పేరు ప్రస్తావన

చంద్రబాబు బావమరిది-వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దర్ని కాల్చిపడేయలేదా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు ఫలానా మంచి పని చేశానని సీఎం చంద్రబాబు చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. రెండేళ్లు పాలన చూస్తే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అనేది మాత్రమే కనిపించిందన్నారు.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×