E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ను రెచ్చగొట్టిన శ్రీయ.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ను రెచ్చగొట్టిన శ్రీయ.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. పల్లవి ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 22nd : కడుపుతో ఉన్న వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. శ్రియ మనకి దూరంగా ఉన్నా సరే తన కోసం ఏదైనా చేసి పెట్టాలి అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఈరోజు కూడా తనకోసం ఇష్టమైన వంటల్ని చేసిపెట్టాను. ఇప్పుడు తీసుకెళ్లి ఇవ్వలేని పరిస్థితి నాది అని బాధ పడిపోతూ ఉంటుంది పార్వతి. నువ్వేం బాధపడకు అమ్మ నీ కోరికను మేము తీరుస్తాము శ్రేయ కోసం నువ్వు చేసిన వంటల్ని మేమే స్వయంగా తీసుకెళ్లి ఇస్తామని అక్షయ్ అనగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తల్లి కోరిక కోసం అక్షయ్ శ్రీకర్ శ్రీయ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ శ్రేయ మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పార్వతి ఎంతో ఇష్టంగా చేసి పంపించిన పిండి వంటల్ని నాకొద్దు అని పంపించేస్తుంది. శ్రీకర్ ను శ్రీయ పిండివంటలు తినాలని అనుకుంటున్నా అని అడుగుతుంది.

పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన అవని..

పల్లవిని ఎలాగైనా సరే తన అత్తింటికి తీసుకురావాలి అని అవని రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అత్తగారింట్లో ఉండాల్సిన నువ్వు పుట్టింట్లో ఇలా మొగుడిని వదిలేసి దర్జాగా ఉంటున్నావా అని పల్లవిని అడుగుతుంది అవని.. పద వెళ్దాం ఇక ఇంటికి అని అవని అంటుంది. నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసిన ఆ ఇంటికి నేను మళ్ళీ ఎలా వస్తాను అనుకున్నావు అని పల్లవి అంటుంది.. అసలు నువ్వెవరు నన్ను కలిసి తీసుకెళ్లడానికని అవనినీ పల్లవి అడుగుతుంది.. ఆ ఇంటికి పెద్ద కోడల్ని అని అవినీ అంటుంది. అయినా నువ్వు ఆ ఇంటికి మళ్ళీ ఎలా తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది. నేను అస్సలు రాను అని పల్లవి ఎంత చెప్తున్నా సరే అవని మాత్రం నువ్వు వచ్చి తీరాల్సిందే అని కండిషన్ పెడుతుంది..

పల్లవికి నిజం తెలుస్తుందా..?

Advertisement

నా కూతుర్ని తీసుకెళ్లడానికి నువ్వెవరు అని రాజేశ్వరి అడుగుతుంది. నేను ఎవరిని అని మీరు ఆలోచించకండి. మీరు గనక ఇలా చేస్తే నేను కచ్చితంగా నిజాలు బయటపెడతానని మీకే చెప్పాను.. కానీ ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెడితే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అని రాజేశ్వరికి వార్నింగ్ ఇస్తుంది. అయినా పిన్ని నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది.. ఏం మాట్లాడాలి అని రాజేశ్వరి అడుగుతుంది.. లోపలికి వెళ్ళిన తర్వాత పల్లవి మీ కూతురు కాదన్న నిజాన్ని నేను ఇవాళ చెప్పేస్తాను.. తర్వాత పల్లవి మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు మీ దగ్గరికి రాదు ఎక్కడికి వెళుతుందో కూడా మీరు ఊహించలేరు.. పల్లవి మిమ్మల్ని అమ్మగా కూడా ఇంకా చూడదు అది మీకు ఇష్టమైతే నాకేం సమస్య లేదు. లేదంటే మీరు పల్లవిని నాతోపాటు పంపించాలి అని అవని అంటుంది. ఆ మాట వినగానే భయపడిపోయిన రాజేశ్వరి సరే పంపిస్తాను అని అంటుంది.

అవనిపై పల్లవికి అనుమానం..

అసలు మామ్ కి అవని ఏం చెప్పింది ఎందుకు మామ్ అంతగా కంగారు పడిపోతుంది.. అంతగా షాక్ అయ్యే విషయం ఏం చెప్తుంది అవని అని తెలుసుకోవాలని పల్లవి అనుకుంటుంది.. కానీ రాజేశ్వరి మాత్రం నువ్వు ఇప్పుడు అవనితోపాటు మీ అత్తగారింటికి వెళ్ళు.. పెళ్లయిన ఆడపిల్లలు పుట్టింట్లో ఉండకూడదు అని సూక్తులు చెప్పి మరి పల్లవి మనసు మార్చేలా చేస్తుంది.. నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసి నా ఇంటికి నేను మళ్ళీ ఎలా వెళ్తాను అసలు వెళ్ళను అని పల్లవి ఎంత చెప్తున్నా సరే.. రాజేశ్వరి మాత్రం నువ్వు వెళ్లి తీరాల్సిందే అని అంటుంది. నువ్వు వెళ్లకపోతే నేను చచ్చినంత ఒట్టు అని రాజేశ్వరి పల్లవిని బలవంతంగా తనతో పాటు పంపిస్తుంది. అవని పై పల్లవికి అనుమానం మొదలవుతుంది.

శ్రీయ వల్ల అమ్మ బాధపడకూడదు..

Advertisement

శ్రేయ వదిన కోసం అమ్మ చేసిన పిండి వంటలు అన్నీ కూడా తీసుకుంటుంది అని నేను అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది అని కమలంటాడు. మరి ఈ పిండి వంటలు తీసుకొని ఇంటికి వెళ్తే అమ్మ చాలా బాధపడుతుంది. అమ్మ బాధపడకుండా ఉండాలి అంటే వీటిని మనమే తినేసేయాలి అని కమల్ అనుకుంటాడు. ఇన్ని వంటల్ని మీరు ఎలా తింటారా అని అక్షయ్ అంటున్న సరే కమల్ ఆరాధ్య ఇద్దరు కలిసి పోటీ పెట్టుకుని తినాలనుకుంటారు. ఇలాంటి వంటలు మనకు కొత్తవి కాదు కదరా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్లకి పెడితే మంచిది కదా అని అక్షయ్ అనగానే కమల్ అక్కడ ఉన్న కొందరు బిక్షగాళ్లకు ఆ భోజనాన్ని ఇచ్చేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పార్వతి ఎంతగా అడుగుతున్నా సరే శ్రేయ వదిన తీసుకుందమ్మ చాలా బాగుంది అనింది అని అంటాడు.. పార్వతికి నమ్మకం కలగకపోయినా ఆరాధ్య చెప్పడంతో నమ్ముతుంది.

పల్లవిని క్షమించని కమల్..

పల్లవి అవనిని ఎంతగా అడుగుతున్న సరే నిజం చెప్పను అని అంటుంది. ఇక పల్లవి మళ్లీ ఆ ఇంటికి రావడం చూసిన పార్వతీ అలాగే భానుమతి ఇద్దరు సంతోషంగా ఉంటారు.. కానీ కమల్ మాత్రం నువ్వు ఇంట్లోకి రావడానికి నేను అసలు ఒప్పుకోను అని అంటాడు. ఇంటిని కూల్చాలని అనుకునే దీన్ని మల్ల ఎందుకు తీసుకొచ్చావు వదిన అని అవనితో కమల్ సీరియస్ గా మాట్లాడుతాడు. కానీ కమల్ అవనీ చెప్పిన వినకుండా పల్లవిని కొట్టబోతాడు. పల్లవి అడ్డుపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఇదేం ట్విస్ట్ మావా.. పల్లవి ప్లేసులోకి కొత్త హీరోయిన్..?

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×