E-Paper
Advertisement

జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. ఇక మంత్రి పదవి అందని ద్రాక్షేనా…?

జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. ఇక మంత్రి పదవి అందని ద్రాక్షేనా…?
Advertisement

మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ బుల్లితెరపై కనిపిస్తుండటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ.. జనసేన పార్టీ కీలక నేతగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నాగబాబు సడెన్ గా జబర్దస్త్ షోకి జడ్జిగా రీ ఎంట్రీ ఇవ్వడం గురించి ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆయనకు కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన జనసేన అభిమానులకు.. ఈ పరిణామం కాస్త మింగుడుపడటం లేదు. ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ నేతలు దీనిపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

మంత్రి పదవి ప్రకటించి.. ఏడాది పూర్తి

Advertisement

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం నాగబాబు అనేక త్యాగాలకు సిద్ధపడ్డారు. కూటమి పొత్తు కారణంగా తాను పోటీ చేయాలనుకున్న స్థానాన్ని వదులుకున్నారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూనే.. త్వరలోనే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రకటించింది. అయితే ఏడాది గడిచి.. మూడు నెలలు అయినప్పటికీ. ఆ దిశగా అడుగులు పడకపోవడం.. ఇప్పుడు ఆయన తిరిగి జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

⦿ మంత్రి పదవి ఇవ్వకపోవడం.. కారణం ఇదై ఉండొచ్చా?

Advertisement

ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం పవన్,  మంత్రి దుర్గేశ్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో.. నాగబాబుకు కూడా అవకాశం ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే పార్టీ నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వడం రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందని కూటమి పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.

⦿ నాగబాబుకు క్లారిటీ వచ్చిందా..?

పూర్తిస్థాయిలో రాజకీయాలకే సమయం కేటాయిస్తానని గతంలో చెప్పిన నాగబాబు.. ఇప్పుడు మళ్ళీ బుల్లితెరపై కనిపించడం వెనుక అర్థమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘మంత్రి పదవి రేసు నుంచి నాగబాబు తప్పుకున్నారా?’ లేక ‘ఆయనకు పదవి దక్కే అవకాశం లేదనే క్లారిటీ వచ్చిందా’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ హోదాలో ఉండి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడిని మళ్ళీ స్క్రీన్ మీద చూడటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

⦿ త్వరలో మంత్రి అవ్వొచ్చా?

రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు.. నాగబాబు టీవీ షోల వైపు వెళ్లడం వెనుక వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు.. లేదా రాజకీయ వ్యూహం కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా.. మెగా బ్రదర్ రీ ఎంట్రీతో అటు బుల్లితెర.. ఇటు రాజకీయ యవనిక ఒక్కసారిగా వేడెక్కాయి. మరి నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందో..? లేదో..? మున్ముందు వేచి చూద్దాం……………

ALSO READ: కేసీఆర్ వారసత్వం వద్దు.. కవిత నయా రాజకీయం వెనుక అసలు ప్లాన్ ఇదే..!

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×