E-Paper
Advertisement

కూటమిలో జెడ్పీటీసీ-ఎంపీటీసీ సీట్ల లొల్లి.. 50- 60 శాతం మేము పోటీ చేస్తాం- నాగబాబు

కూటమిలో జెడ్పీటీసీ-ఎంపీటీసీ సీట్ల లొల్లి.. 50- 60 శాతం మేము పోటీ చేస్తాం- నాగబాబు
Advertisement

Janasena: కూటమి పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకాల లొల్లి ఇంకా కొనసాగుతోంది.  నామినేషన్లు వేసినా మున్సిపాలిటీ, సిటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదు. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల విత్ డ్రాలు ముగియనున్నాయి. ఈ సమయంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ హాట్ హాట్‌గా మారాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 50 నుంచి 60 శాతం తాము పోటీ చేస్తామని తేల్చిచెప్పేశారు. దీంతో మిగతా రెండు పార్టీలు అలర్టయ్యాయి.

కూటమిలో జెడ్పీటీసీ-ఎంపీటీసీ సీట్ల లొల్లి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడి తారాస్థాయికి చేరింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల సందడి మొదలు కానుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఆ పనిలో పడ్డాయి. ఇప్పటికే వైసీపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది. మంగళవారం రాత్రికి లేకుండే బుధవారం ప్రకటించనుంది. ఇదే సమయంలో కూటమి పార్టీలు అలర్టయ్యాయి. 28 జిల్లాల్లో తొలిసారి జెడ్పీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి ఎన్ని అనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

అల్లూరు జిల్లాలో 50 నుంచి 60 శాతం మేం పోటీ-నాగబాబు

Advertisement

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు అరకు పార్లమెంటరీ నియోజకవర్గం జనసేన పరిశీలకులు ఎమ్మెల్సీ నాగబాబు. ఈ క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 50 నుండి 60 శాతం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని నాగబాబు తెలిపారు.

అరకులోయలో మకాం వేసిన ఆయన, ​జడ్పీ చైర్మన్ విషయంలో కూటమి పెద్దల నుండి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ​రంప చోడవరం, పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం ​అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. ​జనసేన పార్టీకి అరకులోయతో అనుబంధం ఉందన్నారు. ఈ ప్రాంతంపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకొచ్చారు. ​గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామానికి రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నదే ధ్యేయమన్నారు.

ALSO READ: కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి

Advertisement

మరోవైపు అరకు పార్లమెంటరీ పరిశీలకులు మజ్జి శ్రీనివాసరావు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ జిల్లాలో పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కడ ఉన్నాయనేది నివేదిక ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జెడ్పీలు, ఎంపీటీసీలు ఎవరికి ఎన్ని? ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై బుధవారం లేకుంటే గురువారం నాటికి క్లారిటీ రావచ్చని సమాచారం. మరోవైపు అరకులో పోటీ చేసేందుకు బీజేపీ కూడా ఉవ్విల్లూరుతోంది. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలిచింది. దీంతో ఆ పార్టీ ఎక్కువగా సీట్లు డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.

Related News

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి

విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజామున నుంచే భక్తుల దర్శనం

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు, విద్యార్థులు ఫుల్‌ఖుషీ

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేనలో కీలక మార్పులు, పలుచోట్ల ఇన్‌ఛార్జీల మార్పులు

నగరి మున్సిపల్ పీఠం ఏకగ్రీవం.. హైకోర్టుకు వెళ్తానన్న రోజా!

చంద్రబాబుకు గెలుపుపై నమ్మకం లేదు.. అందుకే నామినేషన్ల అడ్డుకట్ట: సజ్జల

Big Stories

Advertisement
×