E-Paper
Advertisement

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!
Advertisement

Redmi K100: షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. రెడ్‌మీ K100ను చైనాలో అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే వచ్చిన K100 ప్రో, K100 ప్రో మ్యాక్స్ మోడళ్ల తర్వాత ఈ సిరీస్‌లో ఇది కొత్త మోడల్‌గా చేరనుంది. లాంచ్ తేదీతో పాటు ఫోన్ డిజైన్, డిస్‌ప్లే వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. గేమింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని ఆకట్టుకునేలా ఇందులో కొన్ని ఫీచర్లు ఉండనున్నాయి. ధర, పనితీరు ఎలా ఉంటాయన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్ 27న లాంచ్..

Redmi K100 చైనాలో అక్టోబర్ 27న రాత్రి 7 గంటలకు విడుదల కానుంది. భారత కాలమానం ప్రకారం అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఫోన్ వెనుక భాగం ఫ్లాట్ డిజైన్‌తో కనిపిస్తోంది. పై భాగంలో అడ్డంగా ఉండే కెమెరా మాడ్యూల్‌ను ఇచ్చారు. ఇందులో రెండు వెనుక కెమెరాలు, ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. పక్కనే Sound by Bose అనే గుర్తు కనిపిస్తోంది. దీన్ని బట్టి ఫోన్‌లో బోస్ ట్యూనింగ్‌తో పనిచేసే స్పీకర్లు ఉండొచ్చు.

Advertisement

Also Read: వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

165Hz డిస్‌ప్లే..

ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణంగా ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటే స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారికి ఇది ఉపయోగపడుతుంది. 40కి పైగా గేమ్స్‌లో 165fps గేమింగ్‌కు ఫోన్ నేరుగా సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం చిన్న హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది.

గ్రీన్ రంగులోనూ..

Advertisement

Redmi K100 ఫ్లోరసెంట్ గ్రీన్ రంగులో అందుబాటులోకి రానుంది. చైనాలోని షావోమీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయాలు జరగనున్నాయి. ఫోన్‌కు ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. కుడి వైపు పవర్ బటన్ ఉండగా, కింద భాగంలో USB Type-C పోర్ట్, సిమ్ ట్రే ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో కిందివైపు రెడ్‌మి బ్రాండింగ్ కనిపిస్తుంది.

ధర, ఇతర వివరాలు..

తాజా రిపోర్టుల ప్రకారం.. Redmi K100 ప్రారంభ ధర రూ.50,000. ఈ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండొచ్చని సమాచారం. అలాగే 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రావచ్చని తెలుస్తోంది. వేడి తగ్గించేందుకు మెరుగైన బిల్ట్-ఇన్ యాక్టివ్ ఫ్యాన్‌ను కూడా ఇవ్వొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన హైపర్‌ఓఎస్ 4తో ఫోన్ రావచ్చని కంపెనీ వెల్లడించింది.

Also Read: రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

Tags

Related News

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

Big Stories

Advertisement
×