E-Paper
Advertisement

NHAI Guinness World Records: గిన్నీస్ రికార్డులు క్రియేట్ చేసిన విజయవాడ ఎకనామిక్ కారిడార్‌.. సీఎం అభినందనలు

NHAI Guinness World Records: గిన్నీస్ రికార్డులు క్రియేట్ చేసిన విజయవాడ ఎకనామిక్ కారిడార్‌.. సీఎం అభినందనలు
Advertisement

NHAI Guinness World Records: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. బెంగళూరు–కడప–విజయవాడ (BKV) ఎకనామిక్ కారిడార్ (NH-544G) నిర్మాణ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థలు కలిసి అసాధారణమైన వేగాన్ని చూపాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను నమోదు చేశాయొ. త‌ద్వారా భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో జరిగిన ఈ పనుల నాణ్యత, వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ రికార్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. “ఇది మన ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు నిర్మాణంలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న కొత్త భారతదేశం” అని కొనియాడారు. “కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనితీరు, వేగం దేశానికే ఆదర్శం. ఆయన నాయకత్వంలో మన రాష్ట్రంలో ప్రపంచ స్థాయి రికార్డు సాధించడం గర్వకారణం. 52 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారిని అత్యంత వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డు సృష్టించిన రాజ్ పథ్ ఇన్ ఫ్రా కామ్ సంస్థను, అధికారులను అభినందిస్తున్నాను. 10,655 మెట్రిక్ టన్నుల కాంక్రీటును నిరంతరాయంగా వేసి పాత రికార్డులను తిరగరాశాం. అమరావతి నుండి బెంగళూరుకు నిర్మిస్తున్న ఈ స్ట్రైట్ రోడ్డుకు ‘అమరావతి – బెంగళూరు రోడ్డు’గా పేరు పెట్టాలని కోరుతున్నాను. టీమ్ వర్క్‌తో ఈ విజయాన్ని సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు”  అని పేర్కొన్నారు.

Advertisement

ఈ అద్భుతమైన ఘనతను సాధించడం వెనుక భారీ యంత్రసామగ్రి, నిరంతర శ్రమ దాగి ఉంది. జనవరి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగిన ఈ నిర్మాణ యజ్ఞంలో సుమారు 600 మంది ఇంజనీర్లు మరియు కార్మికులు అహర్నిశలు శ్రమించారు. పనుల కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లను వినియోగించి, రికార్డు స్థాయిలో 156 లేన్ కిలోమీటర్ల మేర రహదారిని పూర్తి చేశారు. కేవలం వేగమే కాకుండా, ఐఐటీ బొంబాయి వంటి ప్రతిష్టాత్మక సంస్థల పర్యవేక్షణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు నిర్వహించడం విశేషం.

రికార్డుల వివరాలను పరిశీలిస్తే, జనవరి 6న 24 గంటల్లో 28.896 లేన్ కిలోమీటర్ల నిర్మాణం మరియు 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటు వేయడం ద్వారా తొలి రెండు రికార్డులు నమోదయ్యాయి. అనంతరం జనవరి 11 నాటికి 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ పేవింగ్ 156 లేన్ కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసి మరో రెండు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

343 కిలోమీటర్ల పొడవైన ఈ 6-లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే బెంగళూరు – విజయవాడ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుండి కేవలం 8 గంటలకు తగ్గుతుంది. దూరం కూడా సుమారు 100 కిలోమీటర్ల మేర ఆదా అవుతుంది. 17 ఇంటర్‌ఛేంజ్‌లు, 5.3 కిలోమీటర్ల పొడవైన సొరంగం వంటి ఆధునిక హంగులతో నిర్మితమవుతున్న ఈ ఎకనామిక్ కారిడార్, దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారనుంది. గిన్నిస్ రికార్డులతో ప్రారంభమైన ఈ ఉత్సాహంతో మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also:  రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×