E-Paper
Advertisement

బల ప్రదర్శన.. కళ్ళు తిరిగి పడిపోయిన వర్షిణి!

బల ప్రదర్శన.. కళ్ళు తిరిగి పడిపోయిన వర్షిణి!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 46వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో ఎల్లో లెవెల్ లో ఉన్న కంటెస్టెంట్స్ గ్రీన్ కి చేరుకోవడానికి గట్టిగానే కష్టపడ్డారు. ఇక్కడ ఇచ్చిన బల ప్రదర్శనలో బరువులు మోయలేక శివ కింద పడిపోతే.. వర్షిణి ఏకంగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నా.. మిగతా కంటెస్టెంట్స్ మనసు కరగకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా రామకృష్ణ ప్రవర్తించిన తీరు అతనిపై నెగెటివిటీ క్రియేట్ అయ్యేలా చేస్తుంది.

ఆ నలుగురే టార్గెట్..

తాజాగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. నా గోట్ అవతారంలో ఎల్లో లెవెల్ లో ఉన్న సభ్యులు గోట్ గా మారేందుకు ఇస్తున్న ఛాలెంజ్ గోట్ ఆఫ్ ఎండురెన్స్ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు. ఒక పెద్ద కర్రను రెండు భుజాల పైన పెట్టుకొని కంటెస్టెంట్స్ వేసే ఇసుక బ్యాగులను మోయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆ టాస్క్ నుండి వారిని ఓడించాలని చూస్తున్నారో రెడ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ టాస్క్ లో పాల్గొన్న వారికి ఎక్కువ వెయిట్ ఇచ్చి ఓడించే అవకాశాన్ని కల్పించారు. అలా ఎక్కువగా రెడ్ జోన్ లో ఉన్న కంటెంట్స్ త్రిగుణ్ , నీతూ, శివ, వర్షిణి లను టార్గెట్ గా చేసుకొని ఎక్కువ వెయిట్ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.

కళ్ళు తిరిగి పడిపోయిన వర్షిణి..

Advertisement

రామకృష్ణ పదేపదే వర్షిణి భుజాలపైన అధిక వెయిట్ వేశాడు. ఆమె.. చాలా బరువుగా ఉంది మోయలేక పోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకున్నా సరే అతడి మనసు కరగలేదు. పైగా నవ్వుతూ ఆమెకు ఇంకొంచెం వెయిట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక వర్షిని చూసుకుంటాను రామకృష్ణ ..కచ్చితంగా నీకు దీన్ని తిరిగి ఇస్తాను అంటూ తనదైన శైలిలో స్పందించింది. ఆ తరువాత నీతూ ను టార్గెట్ గా చేసుకొని ఆమెకు కూడా హెవీ వెయిట్ ఇచ్చారు. అయితే ఆ బరువులు మోయలేక శివ వదిలేసి పక్కన పడిపోయాడు. కొద్దిసేపటికి వర్షిని కూడా కళ్ళు తిరిగి పడిపోవడం ప్రోమోలో చూపించారు. మొత్తానికి అయితే బల ప్రదర్శనలో భాగంగా ఇచ్చిన ఈ టాస్క్ లో వాళ్లు బరువులు మోయలేక కింద పడిపోవడం చూడవచ్చు. ఈ ప్రోమో నెక్స్ట్ రౌండ్ పై మరింత ఆసక్తిని పెంచేసింది. బరువులు మోసి సత్తా చాటి గ్రీన్ లోకి వెళ్లే వాళ్ళు ఎవరో తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే.

also read:రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

Advertisement

నెటిజన్స్ మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . త్రిగుణ్ అసలైన ఆటగాడు అని, నీ టైం కూడా వస్తుంది కచ్చితంగా రోహిత్ , షాలినీలకు నువ్వు ఏంటో చూపించు అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమో షోపై మరింత ఆసక్తిని పెంచేసింది.

 

Related News

రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?

కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు క్లాస్ పీకిన మీనా.. బాలు గెలిచాడు.. రోహిణి దొరుకుతుందా..?

Podarillu Today Episode : కేశవకు షాక్.. మహా ప్లాన్ అదుర్స్.. ఫ్యామిలీ పార్టీ..

Karthika Deepam 2 Serial Today Episode October 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రతో చాలెంజ్ చేసి ఆఫీసుకు వెళ్లిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై చందు సీరియస్.. చివర్లో భద్ర ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అయ్యే సీన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కన్నీళ్లు.. భానుమతికి స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×