Ponnaluru Clash: ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరులో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న మాజీ మంత్రి, వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన ఆదిమూలపు సురేష్‌ను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డుపై బాహాబాహీకి ఓరిపై ఓకరు దిగడంతో కొద్ది సేపటివరకు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు తనతో పాటు వచ్చిన అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతించాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డీఎస్పీని చేతులు జోడించి వేడుకున్నట్లు సమాచారం.
మరోవైపు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిన్నటి నుంచి వైసీపీ అభ్యర్థులను ఒక్కరిని కూడా నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పొన్నలూరులో పోలీసుల మోహరింపు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also read: ఉద్యోగంతో విసిగిపోయారా? రూ. లక్ష ఉంటే చాలు.. ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారాలు ఇవే!