E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు,  భారీ వర్ష సూచన
Advertisement

Weather Alert: ఎల్‌నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా పడుతోంది. ఫలితంగా తుఫాన్లు సైతం ప్రభావం చూపలేకపోతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండలు ప్రజలు అల్లాడిపోున్నారు. తాజాగా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఇవైనా ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయా? ఎల్ నినో ప్రభావం కారణంగా వెనకడుగు వేస్తాయా?

ఏపీ-తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన

ఈశాన్య రుతుపవనాలు కారణాల తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్రమంగా మారుతోంది. ఫలితంగా వాతావరణం మునుపటి కంటే కాస్త చల్లగా ఉంది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో వాతావరణం క్రమంగా మారుతోంది. ఈ క్రమంలో నేటి నుంచి రెండురోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు?

Advertisement

ఈ విషయాన్ని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. దీనికితోడు ఈ వారం బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాలు ఈనెల 24, 26ల మధ్య వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా చేసింది. అందులో ఒకటి తుఫానుగా మారే అవకాశముందని భావిస్తోంది.  ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆది-సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఏపీలోని అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, రాయలసీమలోని కడప, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Advertisement

ALSO READ: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొంది. సాయంత్రం-రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.

Related News

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Big Stories

Advertisement
×