Telugu Tv Serials : బుల్లితెర ప్రేక్షకులను నిత్యం అలరిస్తున్న వాటిలలో టక్కున వినిపించే పేరు సీరియల్స్.. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ కి జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒక్కో సీరియలు ఒక్కో విధమైన స్టోరీ తో రావడంతో వీటిని చూసేందుకు జనాలు కూడా ఆసక్తి కనపరుస్తూ వస్తున్నారు. ఇక టీవీ చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సీరియల్స్ ని అందించడంతో ప్రతిరోజు వచ్చే సీరియల్స్ ని చూసేందుకు ఆడవాళ్ళతో పాటుగా ఇంటిల్లిపాది ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని మంచిగానే ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గత వారం లాగే ఈ వారం కూడా సీరియల్స్ మంచి టిఆర్పి రేటింగ్ నే నమోదు చేసుకున్నాయి. మరికా ఆలస్యం ఎందుకు ? ఈవారం టాప్ లో ఉన్న సీరియల్స్ ఏవి..? ఆ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది అన్నది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అలరిస్తూ వస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి సీరియల్ కూడా మంచి స్టోరీ తో రావడంతో వీటికి టిఆర్పి రేటింగ్ కూడా మంచిగానే ఉంది అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో బిగ్బాస్ కూడా ఈ ఛానల్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా కొన్ని సీరియల్స్ కి మంచి టిఆర్పి రేటింగ్ రావడం విశేషం అనే చెప్పాలి ఈ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా మంచి స్టోరీ తో జనాలని ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈవారం వీక్లీ రౌండర్ కిషన్ కి వస్తే గుండు నిండా గుడి గంటలు సీరియల్ మళ్లీ టాప్ లోకి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని వారాలు గా ఈ సీరియల్ కార్తీకదీపం 2 సీరియల్ తో పోటీ పడుతూ వచ్చింది. ఈవారం మంచి రేటింగ్ కూడా నమోదు చేసుకోవడంతో టాక్అఫ్ ది సీరియల్ గా నిలిచింది..
స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముందంజలో ఉందన్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో టాప్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. రోహిణి బండారం బయటపడినప్పటి నుంచి ఆ ఇంట్లో రోహిణికి అసలు విలువ ఉండదు. అంతేకాదు బాలునే తన్ని ఇరికించాడు అని తమ మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని అని అనుకుంటూ ఉంటుంది.. చింటూ తన కొడుకుని తెలియకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో బాలు నేర్పించేందుకు గుణాకు సాయం చేస్తుంది. మరి బాలును ఇరికించిన రోహిణి బండారం బయటపడుతుందా? లేదా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..