E-Paper
Advertisement

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !
Advertisement

Sachin Tendulkar On Rahul Dravid:  క్రికెట్ హిస్టరీలో డబుల్ సెంచరీ చేయడం ఓ అద్భుతమైన ఘట్టం. ఏ ప్లేయర్ అయినా సరే, డబుల్ సెంచరీ చేసి.. పాపులర్ కావాలని అనుకుంటూ ఉంటాడు. అలాంటిది డబుల్ సెంచరీ చేరుకునేందుకు ఆరు పరుగులు దూరంలో సచిన్ టెండూల్క‌ర్ ఉండగా.. రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి విలన్ గా మారినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 194 పరుగుల వద్ద తాను ఉన్నప్పుడు రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసి తనను అవమానించాడని సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో కూడా రాసుకున్న సంఘటన ఎప్పుడు వైర‌ల్ గా మారింది. 2004లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా ఈ సంఘటన జరగగా ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న గురించి తెలుసుకున్న క్రికెట్ ఫ్యాన్స్, రాహుల్ ద్ర‌విడ్ పై మండిప‌డుతున్నారు.
రాహుల్ ద్ర‌విడ్ కూడా పెద్ద చీట‌రే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సచిన్ డబుల్ సెంచరీ మిస్ ఘటన ఎప్పుడు జరిగిందంటే?

2004 సంవత్సరంలో టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చాక చక్యంతో వ్యవహరించి, మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వా ట్రిపుల్ సెంచరీ చేయగా… సచిన్ టెండూల్కర్ మూడో వికెట్ కు వచ్చి 194 పరుగులు సాధించాడు. మరో ఆరు పరుగులు చేసి ఉంటే సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేరుకునేవాడు. కానీ ఆ లోపే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు డ్రెస్సింగ్ రూమ్ నుంచి రాహుల్ ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో షాక్ అయినా సచిన్ టెండూల్కర్… అన్ని మూసుకొని వెనక్కి వచ్చేసాడు.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

ఈ సంఘటన అప్పట్లో చాలా వివాదంగా మారింది. దీనిపై తన ఆత్మ కథలు కూడా సచిన్ టెండుల్కర్ కీలక అంశాలను పేర్కొన్నారు. మరో ఆరు పరుగులు చేస్తే డబుల్ సెంచరీ పూర్తి చేసుకునేవాడిని.. ఆ లోపే డిక్లేర్ త‌న‌కు అన్యాయం చేశారని తెలిపారు. ఆ స‌మ‌యంలో రాహుల్ ద్రవిడ్ పై చాలా కోపం వచ్చిందని.. అయినప్పటికీ ఓపిక పట్టినట్టు గుర్తు చేశారు. అటు సచిన్ టెండూల్కర్ అభిమానులు కూడా రాహుల్ ద్రావిడ్ కు వ్యతిరేకంగా అప్పట్లో నిరసనలకు దిగారు. ముంబై వేదికగా అతని దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినట్టు సమాచారం.

అసలు రాహుల్ ద్రవిడ్ డిక్లేర్ ఎందుకు చేయాల్సి వచ్చింది?

Advertisement

ముల్తాన్ టెస్ట్ గెలవాలంటే ప్రత్యర్థి జట్టును రెండు సార్లు అలౌడ్ చేయాలి. పాకిస్తాన్ జట్టుకు ఎక్కువ ఓవర్లు ఇచ్చి, ఒత్తిడిలోకి నెట్టివేయాలనేది రాహుల్ ద్రవిడ్ వ్యూహం. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసి కుప్ప కూలింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 675 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ పైన 200ల‌కు పైగా పరుగుల లీడ్ సంపాదించిన నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ గురించి ఆలోచించకుండా టీమిండియా విజయం కోసం డిక్లేర్ చేశాడు రాహుల్ ద్రవిడ్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ను 216 పరుగులకు ఆల్ అవుట్ చేసింది టీమిండియా. దీంతో పాకిస్తాన్ పై 52 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ లెక్కన రాహుల్ ద్రవిడ్ వ్యూహం ఫలించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ ను తిట్టిన వాళ్లే పొగుడుతూ పోస్టులు పెట్టారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×