E-Paper
Advertisement

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్
Advertisement

Vijayawada: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? స్థానిక ఎన్నికలను తన అస్త్రాలుగా మార్చుకోవాలని విజయసాయిరెడ్డి ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రమంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారా? సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంతకామని ఆయన ప్రశ్నించడం వెనుక అసలు ఏం జరిగింది?

ఏపీ రాజకీయాలపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడెక్కాయి. అభ్యర్థుల నామినేషన్లకు గడువు రెండు రోజులు పూర్తి అయ్యింది. చివరిరోజు నామినేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులను అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయరెడ్డి. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా తన మనసులోని ఆలోచనలను బయటపెట్టారు. ‘‘ కాక్రోచ్‌పార్టీతో కాంగ్రెస్‌ కలిసి పని చేస్తోంది.. కాంగ్రెస్‌ పెట్టిన ‘ఇండి’ కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములు అని రాసుకొచ్చారు.

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం-వీఎస్ఆర్

Advertisement

కాక్రోచ్‌కు వైయస్సార్‌సీపీ బేషరతుగా మద్దతు పలికింది, వైసీపీతో కలిసి పని చేస్తున్నామని సీపీఐ ప్రకటించిందని రాసుకొచ్చారు. జీవితంలో జగన్‌ను సీఎం కాకుండా చూడటమే తన లక్ష్యమని, జగన్‌ నెవర్‌ ఎగైన్‌ అన్న ఏబీ వెంకటేశ్వర్రావు శపథం. రెడ్డి పారిశ్రామిక వేత్తలే రెండేళ్ళుగా ఏబీవీ టార్గెట్‌, రంగా తనయుడు వంగవీటి రాధాను జనసేనకు పంపి, ఏబీవీని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించడం చంద్రబాబు మార్కు దుర్మార్గపు రాజకీయాలను రాసుకొచ్చారు. ఏబీవీకి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ మద్దతు పలికడం, సిగ్గు లేని రాజకీయాలను ఏపీ ప్రజలు ఇంకెంత కాలం భరించాలి? ’’అని ప్రశ్నించారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Advertisement

వైసీపీ ఎలాగూ కాక్రోచ్ పార్టీకి మద్దతు పలికింది. ఈ విషయం అందరికీ తెల్సింది. ఇదే క్రమంలో టీడీపీ-జనసేన మధ్య పుల్ల పెట్టే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. రంగాను జనసేన వైపు పంపి, ఏబీవీతో ఇండిపెండింట్‌గా నామినేషన్ చంద్రబాబు వేయించారంటూ ఆ రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసే ప్రయత్నం చేశారు. ఒకవిధంగా చెప్పుకోవాలంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబుతో విభేదించారు మాజీ ఐపీఎస్. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సాయిరెడ్డి ఆలోచనలు చూస్తుంటే.. మొత్తానికి అన్ని పార్టీల మధ్య మంట పెడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Big Stories

Advertisement
×