E-Paper
Advertisement

బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన

బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన
Advertisement

Kakinada District: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఎక్కడో దగ్గర మహిళలు కొట్టుకున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. బస్సు సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఓ కుటుంబంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన కాకినాడ జిల్లాలో బయటపడింది.

ఏపీలోకి కాకినాడ జిల్లాలో షాకింగ్ ఘటన

బాధితులు-ప్రత్యక్ష సాక్షుల మేరకు.. రాజమండ్రికి చెందిన గారా అప్పారావు తన కుటుంబంతో కలిసి శనివారం తుని కాంప్లెక్స్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆ బస్సులో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం ప్రాంతానికి చెందిన నలుగురు మహిళలు ఉన్నారు. కూర్చునే సీట్ల విషయంలో అప్పారావు కుటుంబసభ్యులకు- సిరిపురం మహిళలకు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికి అది కాస్త తారాస్థాయికి చేరింది.

బస్సు సీటు కోసం ఓ ఫ్యామిలీని చితక బాదిన మహిళలు

Advertisement

ప్రయాణికులు అంతా చూస్తుండగా వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహాన్ని తట్టుకోలేని సిరిపురానికి చెందిన మహిళలు.. తమ బంధువులకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న కొందరు.. తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ వారిని రెచ్చగొట్టారు. ఆగ్రహానికి లోనైన సదరు మహిళల బంధువులు, బస్సులు ఏలేశ్వరం మండలం చిన్నంపేట గ్రామానికి రాగానే బస్సు ఎక్కి అప్పారావు కుటుంబంపై దాడి చేశారు. అప్పారావు, ఆయన భార్యతోపాటు ఇతర కుటుంబ సభ్యులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ALSO READ: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

Advertisement

కళ్ల ముందు జరుగుతున్న ఈ దారుణమైన ఘటనను చూసి ప్రయాణికులు కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో అప్పారావు దంపతులు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణను చూసి తీవ్రంగా భయపడిపోయిన అప్పారావు మేనకోడళ్లు ఇద్దరికీ ఫిట్స్ రావడంతో బస్సులో కుప్పకూలిపోయారు. దాడి తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బస్సులోని ప్రయాణికులు- స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటన నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుశారు.

Related News

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

విశాఖలో డేటా సెంటర్ల నీటి వినియోగంపై గూగుల్-అదానీ కీలక నిర్ణయం, అలా చేస్తారట!

భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి… మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారు దర్శనం

శ్రీవారి భక్తులకు గమనిక.. జనవరి నెల సేవలు, దర్శన టికెట్లు నేటి నుంచి విడుదల, వైకుంఠ ద్వార దర్శనాలు

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×