E-Paper
Advertisement

రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!

రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!
Advertisement

Vitamin Deficiency: రాత్రి పూట చక్కగా నిద్రపోయి ఉదయం లేచినా సరే.. ఒళ్లంతా నలతగా, నీరసంగా అనిపిస్తుందా? పగటిపూట పనులపై అసలు దృష్టి పెట్టలేకపోతున్నారా? చాలామంది దీనికి కారణం ఒత్తిడి అనుకుంటారు. కానీ, మన శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్లే ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కంటి నిండా నిద్రపోయినా శక్తి అందకపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

రక్తహీనతకు కారణమయ్యే ఐరన్ లోపం:

అలసట అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఐరన్ లోపం. మన శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు తగినన్ని ఎర్ర రక్త కణాలు తయారవ్వవు. దీనివల్ల రక్తం పడిపోయి నీరసం, కాస్త నడిచినా ఆయాసం వస్తుంటాయి. దీన్ని చాలామంది మామూలు అలసట అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ లోపల పెద్ద సమస్యే నడుస్తుంటుంది.

Advertisement

Also Read: విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

జ్ఞాపకశక్తిని దెబ్బతీసే విటమిన్ బీ12:

ముఖ్యంగా శాకాహారం తినేవాళ్లలో బీ12 విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నరాల పనితీరుకు, శరీరానికి శక్తినివ్వడానికి చాలా ముఖ్యం. ఈ విటమిన్ తగ్గితే కేవలం అలసట మాత్రమే కాదు.. మతిమరుపు, ఏకాగ్రత నశించడం, చేతులు కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి చాలా తొందరగా హెచ్చరించే ప్రమాద ఘంటికలు.

ఎముకలను గుల్లచేసే విటమిన్ డి, మెగ్నీషియం:

Advertisement

ఎండలో తిరిగినా సరే చాలామందిలో విటమిన్ డి లోపం ఉంటోంది. దీనివల్ల కండరాలు బలహీనపడటంతో పాటు మూడ్ కూడా పాడైపోతుంది. అలాగే మెగ్నీషియం సరిగ్గా లేకపోతే రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. దీనివల్ల రోజంతా మొద్దుబారినట్టు, చలాకీగా లేనట్టు అనిపిస్తుంది. శరీరానికి కావాల్సిన ఫోలేట్ లోపించినా ఇలాంటి బలహీనతే వస్తుంది.

ఎలా బయటపడాలి?

ఈ చిన్నపాటి సమస్యల కోసం ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా లోపాలు ఏంటో తెలుసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే పదిహేను నిమిషాలు ఎండలో తిరగడం మంచిది. అలాగే ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పాలు, గుడ్లు ఉండేలా పౌష్టికాహారం తీసుకోవాలి. అలసట చాలా కాలం పాటు వేధిస్తే మాత్రం వెంటనే డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం.

Also Read: కేవలం రూ.17 వేలకే హైయర్ ఫ్రిజ్.. అమెజాన్ సేల్‌లో కస్టమర్లకు పండగలాంటి ఆఫర్లు!

Tags

Related News

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని మెడనొప్పిగా ఉందా? ఈ సింపుల్ వ్యాయామాలు చేస్తే సరి

ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారా? ఇలా చేస్తే నొప్పి అసలు తెలియదు

పనీర్ తయారు చేశాక మిగిలిన నీటిని పారేస్తున్నారా? ఇలా చేస్తే టేస్టీ సూప్ రెడీ

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

Big Stories

Advertisement
×