BigTV English

Jagan-Sharmila: తాడేపల్లిలో నేడు ఆత్మీయ దృశ్యం.. రెండేళ్ల తర్వాత కలుస్తున్న జగన్-షర్మిల

Jagan-Sharmila: తాడేపల్లిలో నేడు ఆత్మీయ దృశ్యం.. రెండేళ్ల తర్వాత కలుస్తున్న జగన్-షర్మిల
YS Jagan-Sharmila news

YS Jagan-Sharmila news(Andhra pradesh political news today):


ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇవాళ ఏపీ సీఎం జగన్‌ను సోదరి షర్మిల కలవనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి అన్నను ఆహ్వానించనుంది. పెళ్లికి ఆహ్వానించించడం వ్యక్తిగతమైన అంశమే అయినా.. షర్మిల, జగన్ భేటీ అక్కడి వరకే ఆగిపోతుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వైసీపీ గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తుందనడంలో అనుమానం లేదు. కాబట్టి.. జగన్.. షర్మిలతో రాజకీయాలపై చర్చించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది.

ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డితో జగన్ రాయబారాన్ని పంపారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రాయబారం విఫలమైన తర్వాతే షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారని తెలుస్తోంది. కుమారుడి వివాహ ఆహ్వన పత్రికను ఇవ్వనున్న షర్మిలతో జగన్ డైరెక్ట్‌గా రాజకీయాలపై చర్చించకపోతారా? అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు చంద్రబాబు, పవన్.. జగన్ పై ముప్పేటదాడి చేస్తున్నారు. ఈ టైంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. హస్తం పార్టీకి ఓటు బ్యాంక్ పెరుగుతోంది. అది కూడా వైసీపీ ఓట్లే చీలుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాబట్టి నష్టనివారణలో భాగంగా జగన్.. షర్మిలతో చర్చించి చివరి ప్రయత్నం చేస్తారేమో అని వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


షర్మిలతో జగన్ రాజకీయాలు మాట్లాడటం ఓ ఎత్తు అయితే.. షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చర్చ నీయాంశంగా మారింది. షర్మిల కేవలం కొడుకు పెళ్లికి అన్నను ఆహ్వానించాడానికే వెళ్తుంది తప్పా రాజకీయాలను ప్రస్తావనకు తీసుకురాదని కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ వర్గాలు భావిస్తున్నాయి. షర్మిల బాగా ఆలోచించే.. కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారని.. ఇక రాజకీయంగా వెనకడుగు వేయరని వైఎస్సార్టీపీ కార్యకర్తలు అంటున్నారు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×