మైక్ టైసన్.. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారికి వరకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980 చివరలో ప్రపంచ వ్యాప్తంగా తన పంచ్ పవర్ ఏంటో చూపించారు. కొమ్ములు తిరిగిన బాక్సర్లను సైతం తన పంచ్ లతో మట్టికరిపించాడు. ప్రపంచంలోనే తిరుగులేని హెవీ వెయిట్ ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆయన జీవితంలో ఎన్నో విచిత్రమైన కథలకు కేరాఫ్ గా నిలిచాడు. రింగ్ లోపల ఎంతో ఘన చరిత్ర ఉన్నా, రింగ్ బయట ఆయన జీవితం ఎన్నో సమస్యలతో నిండిఉంది.
మైక్ టైసన్ ఓ సిల్వర్ బ్యాక్ గొరిల్లాతో ఫైట్ చేసేందుకు ఏకంగా జూ ఉద్యోగికి ఏకంగా $10,000( భారత కరెన్సీలో సుమారు రూ. 9 లక్షలు) లంచం ఇవ్వజూపినట్లు అప్పట్లో వార్తలు సంచలనం కలిగించాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు కూడా. 80ల చివరలో.. అంటే 1986- 1988 మధ్య, హాలీవుడ్ నటి రాబిన్ గివెన్స్ తో టైసన్ పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జూలో ఎంజాయ్ చేయాలనుకున్నారు. జూ గేట్లు ఓపెన్ చేసేందుకు టైసన్ జూ ఉద్యోగికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు. తన భార్యతో కలిసి కొద్ది గంటల పాటు అందులో ఎంజాయ్ చేశాడు. జూలోని జంతువులను చూసుకుంటూ గొరిల్లా ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లారు.
అక్కడ ఓ పెద్ద సిల్వర్ బ్యాక్ గొరిల్లా మిగతా గొరిల్లాలను కొడుతూ కనిపించింది. గొరిల్లా గుంపు మీద తన పెత్తనాన్ని ప్రదర్శిస్తుంది. ఇతర గొరిల్లాలు అమాయకంగా చూస్తున్నాయి. వాటిని చూసిన తనకు బాధ కలిగింది. సిల్వర్ బ్యాక్ గొరిల్లాపై కోపం వచ్చింది. ఎన్ క్లోజర్ లోకి వెళ్లి దానిపై తన పంచ్ ల వర్షం కురిపించాలని భావించాడు. దానితో ఫైట్ చేసేందుకు అనుమతిస్తే, ఏకంగా $10,000( సుమారు రూ. 9 లక్షలు) ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ డబ్బులు తీసుకుని ఎన్‌క్లోజర్ ను ఓపెన్ చేయాలని కోరాడు. “నేను మీకు $10,000 ఇస్తాను. ఆ సిల్వర్ బ్యాక్ పై పంచ్ ల వర్షం కురిపించేందుకు పర్మీషన్ ఇవ్వు అన్నాను. కానీ, అతడు అందుకు అంగీకరించలేదు” అని టైసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read Also: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?
నిజానికి టైసన్ కు జంతువులు, పక్షలు అంటే ఎంతో ఇష్టం. అతడు చిన్నప్పుటి నుంచి ఇప్పటి వరకు పావురాలను పెంచుకుంటూనే ఉన్నాడు. 90లలో బెంగాల్ పులులను పెంచుకున్నాడు. కానీ, ఓ పులి అతడి ఫ్యాన్ మీద దాడి చేసిన తర్వాత పులులను పెంచుకోవడం మానేశాడు.
Read Also: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!