తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నిజాలను బయటపెట్టిందని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు తప్పనిసరిగా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తిరుమలలో జరిగింది కేవలం నెయ్యి కల్తీ కాదని, హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడిగా దాన్ని పరిగణిస్తామని చెప్పారు. మత విశ్వాసాలను అపవిత్రం చేయడాన్ని భారత ఆత్మపై జరిగిన దాడి అని చెప్పారాయన. తిరుమల పవిత్రతను మంటగలిపిన వారు భారీ మూల్యం చెల్లించోకోవాల్సి వస్తుందన్నారు.
The Supreme Court‑appointed SIT has exposed the truth. The guilty will face the full weight of the law. This isn’t adulteration – it is a deliberate assault on the faith of Hindus, a desecration of our belief, and a crime against the soul of Bharat. Those who played with the… https://t.co/ioSnLVNN6q
— Lokesh Nara (@naralokesh) November 10, 2025
సిట్ ఏం తేల్చింది..?
సీబీఐ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. ఈ విచారణలో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. ఏఆర్ డెయిరీ, భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీ వైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వారు ఇందులో ఉన్నారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (NDDB) ల్యాబ్ నివేదికలు లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించాయి. సిట్ విచారణపై జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. 2019 – 24 మధ్య బోలే బాబా ఆర్గానిక్ డైరీ, 68 లక్షల కేజీల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసినట్టు తేలింది. అయితే ఆ సంస్థ నెయ్యి తయారీకోసం పాలు కానీ వెన్న కానీ ఎక్కడా కొనుగోలు చేయలేదు. అంటే టీటీడీకి ఆ కంపెనీ సప్లై చేసిన నెయ్యి అంతా కేవలం రసాయనాలమయమేననే ఆరోపణలు వినపడుతున్నాయి.
టార్గెట్ జగన్..
వైసీపీ హయాంలో జరిగిన ఈ కల్తీ నెయ్యి దందాతో జగన్ ఇరుకున పడ్డారు. టీటీడీ చైర్మన్ గా జగన్ బంధువైన వైవీ సుబ్బారెడ్డి హయాంలో ఈ దందా జరిగిందని, ఇందులో జగన్ కి కూడా వాటాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. నకిలీ నెయ్యి తయారు చేయటానికి వాడిన రసాయనాలు, వాటిని సప్లై చేసిన కంపెనీల వివరాలను సీబీఐ రాబట్టిందని తెలుస్తోంది. ఈ రసాయనాల్లో జంతువుల కొవ్వులు కలిసి ఉన్నాయనే వార్తలు మరింత సంచలనంగా మారాయి. మొత్తానికి సిట్ నివేదిక అధికారికంగా విడుదల కాకముందే ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడం విశేషం.
వైసీపీ ఏమంటోంది?
కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు రావడంతో వైసీపీకి ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థం కావడం లేదు. కల్తీ నెయ్యిపై ఫిర్యాదులు రాగానే శాంపిల్స్ పరీక్షించాలని చెప్పింది నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా కల్తీ విషయంలో తీసిన శాంపిల్స్ టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగాయని చెబుతున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తప్పు జరిగిందనేది వారి వాదన. ఇక కల్తీ జరిగిందని అంటున్నారు కానీ జంతువుల కొవ్వు కలిసిందని ఎక్కడా ఏ ల్యాబ్ కూడా నివేదిక ఇవ్వలేదనే మరో వైదన బయటకు తీస్తోంది వైసీపీ. మొత్తానికి తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణతో వైసీపీ పూర్తి స్థాయిలో ఇరుకునపడ్డట్టయింది.
Also Read: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు
సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ముందుగానే కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో వైసీపీ అలర్ట్ అయింది. అసలు నెయ్యి కల్తీ జరగలేదని కొన్నిసార్లు, కల్దీ జరిగినా జంతువుల కొవ్వు వాడలేదని మరికొన్నిసార్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ కల్తీ జరిగినా అది తమ హయాంలో కాదని మరికొన్నిసార్లు వారు చెప్పడం విశేషం.
Also Read: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?