మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీని టార్గెట్ చేయాలని వైసీపీ చూస్తుంటే, కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీని అడ్డంగా బుక్ చేసింది టీడీపీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యివాడకంపై సిట్ దర్యాప్తులో తేలిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సిట్ దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూశాయని అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి సీఎం జగన్ ని సిట్ దోషులుగా తేల్చిందంటూ టీడీపీ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలు పెట్టింది.
అన్యమతస్తుడైన వైవీ సుబ్బారెడ్డిని తెచ్చి పవిత్రమైన టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడే జగన్ కుట్రను ప్రజలు అర్థం చేసుకుని ఉండాలి. ఏదో అనుకున్నాం కానీ ఇంత మహాపాపం చేస్తారని ఎవరూ అనుకోలేదు. #LadduKalthiDongaluDorikaru#YCPLadduScamFiles#TirumalaLaddu#StopHurtingHindus#AntiHinduJagan… pic.twitter.com/Gli7TN9Yxh
— Telugu Desam Party (@JaiTDP) November 10, 2025
హ్యాష్ ట్యాగ్..
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారంటూ వచ్చిన విమర్శలపై ఏపీ ప్రభుత్వం సొంతగా దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత సీబీఐ ఆధ్వర్యంలో సిట్ బృందానికి ఈ దర్యాప్తు బాధ్యత అప్పగించారు. సిట్ ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుంది. అయితే వీరంతా వివిధ కంపెనీలకు చెందిన వారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏగా చెబుతున్న చిన్న అప్పన్నకు కూడా ఈ కల్తీ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని తేలింది. అయితే అతను వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదని వైసీపీ అంటోంది. ఢిల్లీలో ఏపీ భవన్ చిరుద్యోగి అని చెబుతోంది. కానీ టీడీపీ మాత్రం ఆ లింక్ ని హైలైట్ చేస్తూ ఇదంతా వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని అంటోంది. #LadduKalthiDongaluDorikaru అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తోంది.
శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన జగన్.. ఈ రోజు సుప్రీం కోర్టు నియమించిన సిట్ నీ భాగోతం బయట పెట్టింది. ఇప్పుడు ఏమి సమాధానం చెబుతావ్ @ysjagan? #LadduKalthiDongaluDorikaru#YCPLadduScamFiles#TirumalaLaddu#StopHurtingHindus#AntiHinduJagan#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/q52ZIJUXIP
— Telugu Desam Party (@JaiTDP) November 10, 2025
బాబాయ్.. అబ్బాయ్
అబ్బాయ్ అధికారం.. బాబాయ్ దోపిడీ అంటూ టీడీపీ, వైసీపీని టార్గెట్ చేసింది. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తన జేబులు నింపుకోడానికి ఇంత పాపానికి ఒడిగట్టాడా అని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ టీడీపీ అధికారిక పేజ్ నుంచి ట్వీట్ వేసింది. కేజీ కల్తీ నెయ్యికి 25 రూపాయల చొప్పున వసూలు చేసారని, అంటే 68 లక్షల కేజీలకి రూ.17 కోట్ల కమిషన్ వారికి ముట్టిందని విమర్శించింది. ఆదివారం నుంచి ఈ ఎపిసోడ్ మొదలైంది. ఆ తర్వాత నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అనంతరం టీడీపీ మరింత స్పీడ్ పెంచింది. సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టింది.
Also Read: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?
వైసీపీ కిం కర్తవ్యం?
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ పోరాటాలకు సిద్ధమవుతోంది. గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హడావిడి చేశారు, ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ గొడవ చేస్తున్నారు. కానీ ఏ పాయింట్ కూడా కరెక్ట్ గా దొరకడం లేదని అర్థమవుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ కోటి సంతకాలు సేకరిస్తోంది వైసీపీ. అటు న్యాయస్థానాలు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం విశేషం. ఇలాంటి టైమ్ లో వైసీపీ రెండు విషయాల్లో ఇరుకున పడుతోంది. నకిలీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెయ్యి కల్తీ వ్యవహారం కూడా వైసీపీ మెడకు చుట్టుకునేలా ఉంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం అటుంచి, తానే ఇరుకున పడేలా ఆ పార్టీ పరిస్థితి ఉంది.
Also Read: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి..