BigTV English
Advertisement

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

YouTuber – Mission Impossible:

టామ్ క్రూజ్.. హాలీవుడ్ కు చెందిన ఈ స్టార్ హీరో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆరు పదుల వయసు దాటిన ఈ యాక్టర్.. ఇప్పటికీ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తను నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాల్లో ఆయన చేసిన డేంజరస్ స్టంట్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాయి. ‘మిషన్ ఇంపాజిబుల్ రోగ్ నేషన్’ యుద్ధ విమానం మీద ఆయన చేసిన సీన్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ అద్భుతమైన డెడ్లీ సీన్ ను రీ క్రియేట్ చేసింది భారత సంతతికి చెందిన అమెరికన్ యూట్యూబర్ మిచెల్ ఖరే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


రిస్కీ స్టంట్స్ తో ఆకట్టుకుంటున్న మిచెల్ ఖరే!

మిచెల్ ఖరే ఒక అమెరికన్ యూట్యూబర్. టెలివిజన్ హోస్ట్, నటి కూడా. మాజీ ప్రొఫెషనల్ సైక్లిస్ట్. ఆమె యూట్యూబ్ లో ‘ఛాలెంజ్ యాక్సెప్టెడ్’ అనే ఛానెల్ నడిపిస్తుంది.  ఇందులో ఆమె బోలెడు సాహస వీడియోలను షేర్ చేస్తుంది. సాహసోపేతమైన వీడియోలతో పాటు ప్రమాదకరమైన స్టంట్లను చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలోని ఒక ప్రమాదకరమైన సీన్ ను రీ క్రియేట్ చేసింది. ఆ మూవీలో టామ్ క్రూజ్ C-130 యుద్ధ విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు దానికి వేలాడుతూ కనిపిస్తాడు. అదే సీన్ ను ఖరే ఇప్పుడు రీక్రియేట్ చేసి చూపించింది. ఈ మూవీలో టామ్ ఎలాంటి అదనపు భద్రత తీసుకోడు. కానీ, ఖరే చిన్న రోప్ హెల్ప్ తీసుకుని తన స్టంట్ పూర్తి చేసుకుంది. ఈ స్టంట్ కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఎన్నో వారాలు ట్రైనింగ్ తీసుకుంది.    ప్రొఫెషనల్ స్టంట్ కోచ్‌ లతో శిక్షణ పొందింది. విమానం వేగంగా వెళ్తుండగా, గాలిలో ఎలా తట్టుకోవాలో నేర్చుకుంది.  ఇందుకోసం ఆమె ఏకంగా 10 నెలలు కష్టపడింది. చివరికి అనుకున్నది సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘లేడీ’ టామ్ క్రూజ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

కఠిన శిక్షణ తీసుకున్న ఖరే 

నిజానికి మిచెల్ ఖరే ఎన్నో కఠినమైన ట్రైనింగ్స్ తీసుకుంది.  ఆమె FBI, సీక్రెట్ సర్వీస్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో శిక్షణ పొందింది.  ఆమె నటిగానే కాకుండా  ఒకప్పుడు ప్రొఫెషనల్ రోడ్ సైక్లిస్ట్‌ గా ఉండేది. తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సైక్లింగ్‌ను వదిలివేసింది. అటు పిల్లల పోటీ కార్యక్రమం ‘కర్మ ఆన్ మ్యాక్స్’కి హోస్ట్ చేస్తుంది.


Read Also:  తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Related News

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Big Stories

×