Shiva : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అటువంటి సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన శివ సినిమా ఒకటి. శివ సినిమాకు ముందు రావు గారి ఇల్లు అనే సినిమాకి చివరి అసిస్టెంట్ డైరెక్టర్ గా
పనిచేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమాకి శివ నాగేశ్వరరావు కో డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సినిమాకి రామ్ గోపాల్ వర్మ పనిచేసినప్పుడు పెద్ద కాన్సన్ట్రేషన్ చేసేవాడు కాదు. ఎడిటింగ్ రిపోర్ట్ బుక్ ఇస్తే ఎక్కడో పడేసేవాడు. క్లాప్ కూడా సరిగ్గా కొట్టేవాడు కాదు.
అయితే అప్పటికే రాంగోపాల్ వర్మతో అక్కినేని వెంకట్, సురేంద్ర వీళ్ళిద్దరితో మంచి పరిచయాలు ఉండటంతో రామ్ గోపాల్ వర్మాను భరించేవాళ్లు. అయితే శివ నాగేశ్వరరావు తో కూడా బాగా మాట్లాడేవాడు రాము. మొత్తానికి తనకు ఉన్న సినిమా పరిజ్ఞానంతో నాగార్జునను ఇంప్రెస్ చేసి శివ సినిమా కథను చెప్పేసాడు. అయితే మొదటిసారి రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఆ సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమాకి శివ నాగేశ్వరరావు కో డైరెక్టర్ గా పని చేశారు.
శివ సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రను మార్చేసింది. విజయవాడలో ఆ సినిమా విడుదలైనప్పుడు చాలామంది సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగేవారు అని కూడా చెప్పుకునేవారు.
నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ కూడా శివ సినిమాతో వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆ సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఈ రోజుల్లో కూడా ఆ సినిమా చూసిన ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. ఆ రోజుల్లో వర్మ ఆ స్థాయిలో ఆలోచించటం అనేది మామూలు విషయం కాదు.
అయితే ఇప్పుడు శివ సినిమాకి సీక్వెల్ చేస్తే ఎవరిని హీరోగా తీసుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. శివ అనే సినిమా కేవలం నేను నాగర్జున కోసమే రాశాను. ఇంకో 36 సంవత్సరాలు అయినా కూడా ఒకవేళ తీస్తే ఆయనతోనే సినిమా చేస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. ఈ తరుణంలో అక్కినేని వారసులు అఖిల్ మరియు నాగచైతన్య తో చేస్తారా అని అడిగితే నో అని ధైర్యంగా చెప్పేసాడు.
శివ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ అప్పటివరకు ఉన్న రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు అని చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి రాంగోపాల్ వర్మకి అసలు రూల్స్ తెలియదు. శివ సినిమా ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి అని సీన్స్ విషయంలో క్లారిటీ తనకి బాగా ఉండేది.
అందుకనే ఒక షాట్ అయిపోయిన వెంటనే కట్ చెప్పేవాడు. అలా చెప్పిన వెంటనే యూనిట్ అంతా కూడా ఆశ్చర్యపడేది. కానీ రాంగోపాల్ వర్మ కి క్లారిటీ ఉంది కాబట్టి అది వర్కౌట్ అయింది. మొత్తానికి ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము అంటే ఆ సినిమా ప్రభావం అలాంటిది.
Also Read: The Great Pre wedding show: సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన, జనాలు రావడం లేదు, ఇండస్ట్రీ నిలబడదా?