BigTV English
Advertisement

SK24 : శివ కార్తికేయన్ సినిమా స్టార్ట్ అప్పుడే, నాని వదిలేసిన కథతోనే సిబి సినిమా

SK24 : శివ కార్తికేయన్ సినిమా స్టార్ట్ అప్పుడే, నాని వదిలేసిన కథతోనే సిబి సినిమా

SK24 : ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు హీరోలు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలో కూడా చూడటం మొదలుపెట్టారు. అలానే తమిళ నటులను కూడా ఇక్కడ విపరీతంగా ఆదరిస్తుంటారు. ఇది ఈ మధ్యన స్టార్ట్ అయింది కాదు. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, శింబు వంటి ఎందరో హీరోలు సినిమాలు అప్పట్లో విడుదలయ్యేవి. వాటిని కూడా మన తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా చూసేవాళ్ళు.


ఈ మధ్యకాలంలో విజయ్, ధనుష్, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి హీరోల సినిమాలు కూడా పాపులర్ అయ్యాయి. చాలామంది తమిళ్ హీరోలు తెలుగు దర్శకులతో కూడా పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఇదివరకే శివ కార్తికేయన్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ప్రిన్స్ అనే సినిమా చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. శివ కార్తికేయన్ నటించిన డాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సిబి తో శివ కార్తికేయం సినిమా చేస్తున్నాడు.

సినిమా స్టార్ట్ అప్పుడే

శివ కార్తికేయన్ నటిస్తున్న 24వ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్లో మొదలుకానుంది. ఈ సినిమాకు సంబంధించి 40 నుంచి 45 రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. శివ కార్తికేయన్ సరసన శ్రీ లీల ఈ సినిమాలో నటిస్తోంది. సాయి అభయాన్కర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ప్యాషన్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తుంది.


ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన డ్యూడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమాకి సాయి అభియాన్కర్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ సూపర్ హిట్ అయిపోయాయి. ఇప్పుడు సాయి ఒక మ్యూజిక్ సెన్సేషన్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాకి కూడా సాయి సంగీతం అందిస్తున్నాడు.

నాని వదిలేసిన ప్రాజెక్ట్ 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో న్యాచురల్ స్టార్ నాని ఒక ప్రత్యేకమైన హీరో. ఎక్కువగా ఒక దర్శకుడు యొక్క టైం వేస్ట్ చేయడు. కొన్ని సందర్భాల్లో నాని అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అవుతుంటాయి. దానికి కారణం నానికి డేట్స్ అడ్జస్ట్ కాకపోతే ఆ డైరెక్టర్ ని ఇంకో హీరోతో సినిమా చేసేమని ఓపెన్ గా చెప్పేస్తాడు.

బలగం సినిమా నచ్చిన తర్వాత వేణుతో ఎల్లమ్మ అనే ప్రాజెక్టు చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ నా నీకు ఉన్న కమిట్మెంట్స్ వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. డాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ శిబి చక్రవర్తితో నాని సినిమా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు. అప్పుడు నాని వదిలేసిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు శివ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read: Shiva : శివ సీక్వెల్? ఆ ఇద్దరు హీరోలని రిజెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Related News

Shiva Remake: శివ రీమేక్ .. ఆ హీరోలకు అంత గట్స్ లేవన్న కింగ్..ఇలా అనేశాడేంటీ?

Nagarjuna: నాన్నగారు స్మశానం దగ్గర నాతో ఆ మాటను చెప్పారు

RGV: శివ కథను 20 నిమిషాల్లో రాశా, అక్కడి నుంచి కాపీ చేసా

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!

The Raja Saab : ఫస్ట్ సింగిల్ గురించి ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన ఎస్కేఎన్, మరో రెండు వారాల్లో

Arasan : శింబు సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడే, క్లారిటీ ఇచ్చిన వెట్రి

Shiva : శివ సీక్వెల్? ఆ ఇద్దరు హీరోలని రిజెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Big Stories

×