ప్రతి వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. ఒక్కసారి పెడితే జీవితాంతం కొనసాగుతుంది. చాలా వరకు తమ పేర్లను చిన్నగా, అందరూ పలికేందుకు వీలుగా ఉండేలా చూసుకుంటారు. కానీ, కొంత మంది డిఫరెంట్ గా ఉండేందుకు పొడవైన పేర్లు పెట్టుకుంటారు. మన మాజీ దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుగా కూడా చాలా పొడవుగా ఉంటుంది. అయితే, కలాం పేరుకంటే ఎంతో పొడవైన పేర్లు కలిగిన వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డు లారెన్స్ వాట్కిన్స్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న వ్యక్తిగా ఆయన గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆయన పూర్తి పేరును చెప్పడానికి ఏకంగా 20 నిమిషాల సమయం పడుతుంది.
నిజానికి లారెన్స్ వాట్కిన్స్ కు గిన్నిస్ రికార్డుల పట్ల చాలా ఆసక్తి ఉండేది. మిగతా వారిలా కష్టపడకుండానే తాను ఆ రికార్డు క్రియేట్ చేయాలనుకున్నాడు. ఎలా చేస్తే, తన పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందా? అని ఆలోచించాడు. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన పేరును అత్యంత పొడవుగా మార్చాలి అనుకున్నాడు. వెంటనే, లారెన్స్ గ్రెగొరీ వాట్కిన్స్ అనే పేరును కలిగి ఉన్న ఆయన, తన పేరును విస్తరించాలి అనుకున్నాడు. పురాతన లాటిన్, పాత ఇంగ్లీష్ పదాల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు అన్ని పదాలను పేర్లను సేకరించి.. ఒక అర్థవంతమైన పేరుగా తయారు చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పేరు కోసం ఆయన నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ పేరులో ‘బాసిల్ బ్రష్’ అనే నక్క తోలుబొమ్మ, 1984 ఒలింపిక్ జిమ్నాస్ట్ మిచ్ గేలార్డ్ నుంచి ప్రేరణ పొందిన ‘గేలార్డ్’ ” లాంటి విచిత్రమైన పదాలను కూడా చేర్చుకున్నాడు.
మొత్తంగా 1990లో వాట్కిన్స్ పొడవైన పేరును తయారు చేసుకున్నాడు. పేరును మార్చుకోవడానికి ఆక్లాండ్ జిల్లా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. న్యాయస్థానం మొదట దానిని ఆమోదించింది. కానీ, రిజిస్ట్రార్ జనరల్ ఆ నిర్ణయాన్ని సవాలు చేశారు. అయినప్పటికీ వాట్కిన్స్ వెనక్కి తగ్గలేదు. హైకోర్టులో కేసు వేసి, తన పేరు మార్పు కోసం కొట్లాడాడు. చివరికి విజయం సాధించాయి. అధికారికంగా పొడవైన వ్యక్తిగత పేరు కలిగిన వాట్కిన్స్ గుర్తింపు పొందాడు. అతడి పూర్తి పేరు ఏకంగా 6 పేజీలు ఉంది. ఆయన పేరును టైప్ చేసేందుకు టైప్ రైటర్లు ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు టైపోగ్రాఫికల్ తప్పులు కూడా జరిగాయి.
This is Laurence Watkins from New Zealand.
Well, it used to be, until he changed his name via Deed Poll in 1990.
His official name now includes 2,253 words and he now holds the record for the longest personal name. pic.twitter.com/ZiaOoe2OLr
— Guinness World Records (@GWR) October 7, 2025
ప్రస్తుతం ఆస్ట్రేలియన్ పౌరుడిగా సిడ్నీలో నివసిస్తున్న వాట్కిన్స్, రోజువారీ జీవితానికి తన పేరును చిన్నగా మార్చుకున్నాడు. కానీ, అధికారిక పత్రాలపై పూర్తి వెర్షన్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. అతడి బర్త్ సర్టిఫికేట్ ఏకంగా 7 పేజీలను కలిగి ఉంటుంది. పాస్‌పోర్ట్ లో కూడా అతడి పొడవైన పేరుకు సరిపోయేలా అదనపు పేజీలు యాడ్ చేశారు. అతడి పూర్తి పేరుతో కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినా, ఆయన ఏనాడు తన పేరు విషయంలో వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగానే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫర్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు వాట్కిన్స్.
大爷起全球最长名字 念完要20分钟:他是全世界拥有最长合法名字的人。全名是Laurence + 2308 个中间名 + Watkins pic.twitter.com/Kd8sv1PwMD
— xiao Y (@xczyuan) October 12, 2025
Read Also: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!