OTT Movie : ఓటీటీలోకి ఒక సరికొత్త బ్రిటిష్ హారర్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ హారర్‌లో బాంబి అనే ఒక జింక మాన్స్టర్‌గా మారి మనుషుల్ని వేటాడుతుంది. ట్రైలర్ చూస్తేనే షాక్ అయ్యేలా ఉంటుంది. ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ లో నే ఉంటుంది. ట్విస్టులు, యాక్షన్ సీన్లతో ఈ సినిమా బజ్ క్రియేట్ చేసింది. హారర్ లవర్స్‌కు కల్ట్ ఫాలోయింగ్ తెచ్చింది. ఒక్క సారి చూస్తే మైండ్ షేక్ అవుతుంది. మీరు కూడా ఓ సారి దీనిపై లుక్ వేయండి. వీకెండ్ అయితే మరీ మంచిది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బాంబి: ది రెకనింగ్’ (Bambi: The Reckoning) అనే ఈ డార్క్ రివెంజ్ సినిమా, డాన్ అలెన్ డైరెక్షన్‌లో వచ్చింది. జాగ్డ్ ఎడ్జ్ ప్రొడక్షన్స్ తీసిన ఈ సినిమా ‘ట్విస్టెడ్ చైల్డ్‌హుడ్ యూనివర్స్’ (TCU)లో నాలుగో మూవీ. ఇందులో రాక్సాన్ మెకీ (జానా), టామ్ ముల్హెరాన్ (బెంజి), నికోలా రైట్, సమీరా మైటీ మెయిన్ రోల్స్ లో నటించారు. 2025 జులై 25న అమెరికాలో రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది 1923 నవల ‘బాంబి, ఎ లైఫ్ ఇన్ ది వుడ్స్’ ఆధారంగా రూపొందింది.
జానా, ఆమె కొడుకు బెంజి ఒక కారులో అడవి మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ఉన్నట్టుండి వీళ్ళ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో వీళ్ళు అడవిలో చిక్కుకుంటారు. అక్కడ ఒక భయంకరమైన బాంబి అనే జింక వాళ్లను వేటాడుతుంది. బాంబి గతం దారుణంగా ఉంటుంది. దాని తల్లిని హంటర్స్ కాల్చి చంపేశారు. భార్యని ఒక ఫార్మా కంపెనీ ట్రక్ ఢీ కొట్టి చంపేసింది. పిల్ల జింకను కిడ్నాప్ చేసి ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. ఆతరువాత ఆకలితో ఉన్న ఆ జింక, టాక్సిక్ కెమికల్స్ తాగి ఒక మాన్స్టర్‌గా మారిపోతుంది. మనుషులందరిపై రివెంజ్ తీర్చుకోవడం మొదలుపెడుతుంది.
Read Alo : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?
దాని కొమ్ములు పెద్దవిగా, షార్ప్‌గా మారి ఎవరినైనా ఒక్క వేటుకి చంపే విధంగా ఉంటుంది. దానిని చూసి జానా భయపడి తన ఫ్యామిలీకి ఫోన్ చేస్తుంది. నలుగురు మనుషులు రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తారు. కానీ బాంబి ఒక్కొక్కరినీ క్రూరంగా చంపడం మొదలు పెడుతుంది. మరో వైపు అది కంపెనీ టాక్సిక్ వేస్ట్ తాగడం వల్లే మాన్స్టర్ అయిందని తెలుస్తుంది. ఇక జింక క్రూరత్వానికి హద్దులు లేకుండా పోతాయి. క్లైమాక్స్ మరింత ఘోరంగా ఉంటుంది. చివరికి ఆ అడవిలో జింకను మనుషులు అడ్డుకుంటారా ? దాని చేతిలో బలవుతారా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.