అదృష్టం ఎవరిని.. ఎప్పుడు.. ఎలా తలుపు తడుతుందో చెప్పడం కష్టం. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. యూఏఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. తన తల్లి పుట్టిన తేదీతో కూడిన నెంబర్ కు లాటరీ తగింది. సంతోషంలో ముగినిపోయిన ఆ యువకుడు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. అతడి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి బొల్లా అనిల్ కుమార్ యూఏఈలో నిర్వహించిన లాటరీలో రూ. 240 కోట్లు తగలడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్ స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైదరాబాద్‌లో పీజీ చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం యూఏఈ వెళ్ళాడు. రెండు సంవత్సరాలుగా అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్, తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల కొనుగోలు చేసిన 10 లాటరీ టికెట్లలో ఒకటి తన తల్లి భూలక్ష్మి పుట్టిన రోజు తేదీతో కూడిన నంబర్‌కు ఏకంగా రూ.240 కోట్ల లాటరీ తగిలింది. ఈ విషయం తెలుసుకున్న అనిల్ కుటుంబంలో సంతోషం మునిగిపోయారు. అనిల్ తల్లిదండ్రులు మాధవరావు, భూలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని అనిల్ చెప్పాడు. ఇదే లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని అనిల్ చెప్పుకొచ్చాడు.
యూఏఈలో చాలా మంది పెద్ద మొత్తంలో లాటరీలు గెలుచుకుంటారు. అక్కడ మూడు చట్టబద్దమైన లాటరీలు ఉన్నాయి. నిజానికి అక్కడి ప్రభుత్వం లాటరీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) కేవలం లైసెన్స్ పొందిన మూడు లాటరీలను మాత్రమే అనుమతిస్తుంది. ఇవి 18 సంవత్సరాలు పైబడిని వాళ్లే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
UAE మొట్టమొదటి జాతీయ లాటరీ. డిసెంబర్ 2024న ప్రారంభించారు. ఇది ఆదేశంలోనే అతిపెద్ద లాటరీ. దీని విలువ 100 మిలియన్ Dh. www.theuaelottery.aeకి వెళ్లి, ఎమిరేట్స్ IDతో సైన్ అప్ చేయాలి. 6 సంఖ్యలు (1–31), నెల సంఖ్య (1–12) సెలెక్ట్ చేసుకోవాలి. క్విక్ పిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్రతి టికెట్ Dh50 ఉంటుంది. డ్రాలు ప్రతి రెండు వారాలకు ఓసారి ఉంటుంది. ఇందులో విజేతలకు 100 మిలియన్ Dh అందిస్తారు.
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న లాటరీ వ్యవస్థ ఇది. ఇది భారీ నగదు, లగ్జరీ కార్లను అందిస్తుంది. www.bigticket.aeలో, విమానాశ్రయంలో Dh500 టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనండి. ప్రతి టికెట్‌లో ఒక నంబర్ ఉంటుంది. ప్రతి నెలా ఒకరు పెద్ద బహుమతిని గెలుస్తారు. Dh15 మిలియన్ల నుంచి Dh32 మిలియన్ల వరకు నగదు, అలాగే Dh100,000 కంటే ఎక్కువ విలువైన పోర్షెస్ వంటి కార్లు అందిస్తారు. .
ఇది 1999 నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. విమానాశ్రయంలో, www.dubaidutyfree.comలో Dh1,000 టికెట్ కొనాలి. వారానికి రెండుసార్లు బుధ, ఆదివారాల్లో డ్రా నిర్వహిస్తారు. డ్రాకు 5,000 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవుతాయి. $1 మిలియన్ డాలర్లు, లగ్జరీ కార్లు బహుమతిగా అందిస్తారు.
చాలా మంది భారతీయులు ఎంపిక చేసిన UAE లాటరీలను ఆన్‌లైన్‌లో ఆడటం ద్వారా గెలుచుకునే అవకాశం ఉంటుంది. బిగ్ టికెట్ అబుదాబి, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లాంటి లాటరీ టికెట్లు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్/డెబిట్ కార్డ్ ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
Read Also: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!