E-Paper
Advertisement

శ్రీకాకుళంలో ఘోర విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు విద్యార్థులు.. ఇద్దరు మృతి!

శ్రీకాకుళంలో ఘోర విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు విద్యార్థులు.. ఇద్దరు మృతి!
Advertisement

Srikakulam Tragedy: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వచ్చిన విద్యార్థుల బృందంలో నలుగురు రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తీరంలో సరదా.. క్షణాల్లో విషాదం

Advertisement

పెద్దగనగళ్ళవాని పేట సముద్ర తీరానికి విహారయాత్రగా వచ్చిన విద్యార్థులు నీటిలో సరదాగా ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలు వారిని లోపలికి లాక్కెళ్లాయి. ప్రమాదాన్ని గమనించిన తోటివారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

రెండు మృతదేహాలు లభ్యం..

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గజ ఈతగాళ్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మహి (19), పావని (19) అనే ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు తీరానికి కొట్టుకురాగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల జాడ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో విస్తృతంగా శోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: చంద్రబాబూ.. ఇవి విజయాలు అనుకుంటే పొరపాటే!- సజ్జల రామకృష్ణారెడ్డి

Tags

Related News

చంద్రబాబూ.. ఇవి విజయాలు అనుకుంటే పొరపాటే!- సజ్జల రామకృష్ణారెడ్డి

నగరిలో మళ్లీ ఎన్నికలు గ్యారెంటీ.. కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న రోజా వ్యాఖ్యలు!

కూటమిలో జెడ్పీటీసీ-ఎంపీటీసీ సీట్ల లొల్లి.. 50- 60 శాతం మేము పోటీ చేస్తాం- నాగబాబు

కడపలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. ఆరుగురు వ్యక్తులు ఎవరు? స్కార్పియోలో వచ్చి

విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజామున నుంచే భక్తుల దర్శనం

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు, విద్యార్థులు ఫుల్‌ఖుషీ

Big Stories

Advertisement
×