Deepika Padukone -Ranveer Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో దీపికా పదుకొనే(Deepika Padukone) రణవీర్ సింగ్(Ranvir Singh) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ దంపతులు ఒకవైపు వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా గడుపుతున్నారు. ఇక రణవీర్ దీపిక దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు పుట్టటం విశేషం.
దీపిక రణవీర్ దంపతులకు మొదటి సంతానంలో భాగంగా దువా జన్మించారు. అయితే ఇటీవల దీపిక రెండో బిడ్డకి కూడా జన్మనిచ్చారు. ఈ దంపతుల సెప్టెంబర్ 19వ తేదీ రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని దీపికా రణవీర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కానీ ఎక్కడా కూడా తమ కూతురి ఫోటోని రివీల్ చేయలేదు. ఇకపోతే దసరా పండుగ సందర్భంగా మొదటిసారి దీపిక పదుకొనే తన చిన్న కుమార్తె ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా రణబీర్ దీపిక దంపతులతో పాటు తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదేవిధంగా తన చిన్న కుమార్తెకు పేరు పెట్టినట్టు ఈ సందర్భంగా రణవీర్ దంపతులు తెలియజేశారు. తమ కుమార్తెకు దేవీ పదుకొనే సింగ్ (Devi Padukone Singh)అని నామకరణం చేసినట్టు ఈ సందర్భంగా దీపిక తెలియజేశారు. ఈ ఫోటోలో భాగంగా తన ఇద్దరి పిల్లలు ఒకే రంగు దుస్తులలో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. అయితే ఈ ఫోటోలో కూడా దీపిక తన చిన్న కుమార్తె ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దీపిక రణవీర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల దురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాసర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో రణవీర్ బిజీగా ఉన్నారు. ఇక దీపిక విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాకా(Raaka) సినిమాలో దీపికా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కల్కి సినిమాలో ప్రభాస్ జోడిగా నటించిన ఈమె కొన్ని కారణాల వల్ల సీక్వెల్ సినిమా నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో దీపిక మొదటి ఎంపిక అయినప్పటికీ పని వేళల కారణంగా సందీప్ రెడ్డితో వచ్చిన వివాదాలు నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
Also Read: నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!