BigTV English

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చింది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన తారకరత్నను కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి పల్స్ పడిపోయినట్టు గుర్తించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే సీపీఆర్ చేశారు. డాక్టర్ల క్విక్ రెస్పాన్స్ వల్ల ఆయన పల్స్ మళ్లీ నార్మల్ అయింది.


ఆ తర్వాత తారకరత్నకు యాంజియోగ్రామ్ చేశారు. హార్ట్ లో బ్లాక్స్ ఉన్నందువల్ల స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యేలు బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. కుప్పం వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాలకృష్ణతోనూ ఫోన్లో మాట్లాడారు చంద్రబాబు.


తారకరత్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందనే విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బాబాయ్ బాలకృష్ణకి ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదని.. వైద్యులు చికిత్స చేస్తున్నారని చెప్పారు బాలయ్య.

ఉదయం.. కుప్పం లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యువగళం పాదయాత్ర ప్రారంభించారు నారా లోకేశ్. కొద్దిదూరం నడిచాక.. మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి బాగా ఉండటంతో తారకరత్న ఇబ్బందికి గురయ్యారు. గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సెక్యూరిటీ సిబ్బంది ఎంత కోరినా అభిమానులు వినకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే హాస్పిటల్ కు తరలించడంతో ప్రమాదం తప్పింది.

అయితే, హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అవకావం ఉంటే కుప్పం నుంచి బెంగళూరు ఆసుపత్రికి హెలికాప్టర్ లో ఎయిర్ లిఫ్ట్ చేస్తామన్నారు గోరంట్ల.

AP: యువగళం.. వారాహి.. బహుదూరపు బాటసారులు.. లక్ష్యాన్ని చేరేనా?

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు రెడీ .. రూట్ మ్యాప్ ఇదే..

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×