Big Stories

Jamuna : ఎన్టీఆర్, ఎన్నాఆర్ తో జమున 3 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు?.. మళ్లీ ఆ సినిమా కలిపింది..

Jamuna : జమునకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి చేత మాటపడని మనసతత్వం. కోపమొస్తే ఆమెలో సత్యభామ కనిపిస్తారు. పట్టుదల ఎక్కువే. ఆత్మాభిమానంతో ఉన్నవారికి ఎవరితోనైనా గొడవలు వస్తాయి. ఈ విషయాలను ఆమె ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అలా ఎన్టీఆర్, ఎన్నాఆర్ తోనూ ఆమెకు మాట పట్టింపులు వచ్చాయి. ఆ కథానాయకులిద్దరూ అప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నారు. నిర్మాతలు, దర్శకులు వాళ్లే చుట్టూనే క్యూ కడుతున్న రోజులు. అయితే ఇలాంటి సమయంలోనూ జమున వారిని లెక్కచేయలేదు. ఎన్టీఆర్, ఎన్నాఆర్ తో సినిమాలు చేయనని తెగేసి చెప్పారు. ఆ హీరోలతో మూడేళ్లు మాట్లాడలేదు. ఆ సమయంలో జగ్గయ్య లాంటి హీరోల సరసన నటించి సూపర్ హిట్ లు అందుకున్నారు.

- Advertisement -

కాంచనమాల, కన్నాంబ.. తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం తర్వాత సావిత్రి, జమున టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా మెరిశారు. అలాంటి జమున.. ఎన్టీఆర్, ఎన్నాఆర్ తో సినిమాలు చేయడం మానేయడం దర్శక, నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. అయితే ఎన్టీఆర్, ఎన్నాఆర్ కలిసి నటించే ఓ సినిమాలో జముననే ఒక హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక, నిర్మాతలు అనుకున్నారు. ఆమె ససేమిరా అన్నారు. కానీ పట్టుబట్టి ఒప్పించి ఆ సినిమాలో జమునను నటింపజేశారు. ఆ సినిమానే గుండమ్మకథ.

- Advertisement -

ఎన్టీఆర్‌ , ఏఎన్నార్‌ తో ఉన్న వివాదాన్ని ‘గుండమ్మ కథ సినిమా కాంప్రమైజ్‌ చేసిందని జముననే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గుండమ్మ కథలో సరోజ పాత్రలో జమునే నటించాలని నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, జమున సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. అలా గుండమ్మ కథలో చిలిపి అమ్మాయిగా జమున ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా పేరు వినగానే నందమూరి తారక రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు, సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇలా గుండమ్మ కథ జమున కెరీర్ లో గొప్ప సినిమాలో మిగిలిపోయింది.

ఎన్టీఆర్ తో మిస్సమ్మ, భూకైలాస్‌, గుండమ్మ కథ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ తులాభారం.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో జమున నటించారు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించారు. ఇందులో జమున సత్యభామ పాత్ర పోషించారు. ఈ చిత్రంలో కృష్ణుడిని సత్యభామ కాలితో తన్నే సన్నివేశం తీవ్ర వివాదాన్ని రేపింది. ఈ సన్నివేశంపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణుడి పాత్రను సత్యభామ తన్నినట్లుగా చూడలేదు. ఎన్టీఆర్ ను జమున తన్నిందనే విధంగా అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు ఆ రోజుల్లో. అందుకే అప్పటికీ ఇప్పటికీ తెలుగువాళ్లకు సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది.

సావిత్రితో మాట పట్టింపులు..
సావిత్రి – జమున.. ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’ లాంటి చిత్రాల్లో అక్కాచెల్లెళ్లుగా నటించారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వారు అక్కాచెల్లెళ్లుగా ఉండేవారు. అయితే వీళ్లిద్దరూ ఓ ఏడాది పాటు మాట్లాడుకోలేదని గతంలో ఓసారి జముననే చెప్పారు. కొంతమంది వ్యక్తులు తమ మధ్య దూరం పెంచారని తెలిపారు. తర్వాత వివాదాలు సమసిపోయి మళ్లీ కలిశామన్నారు.

Jamuna : వెండితెర సత్యభామ జమున.. అలాంటి పాత్రల్లో ఆమెకు సాటిలేరెవ్వరూ..

Jamuna: జమున మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. మృతిపట్ల ప్రముఖుల సంతాపం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News