BigTV English

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఖడించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌ను బ్లాక్ చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ రగడ ఢిల్లీ యూనివర్సిటీని తాకింది. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్లు విపక్షాల విద్యార్థి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి.


దీనిపై స్పందించిన డీయూ అధికార వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించనివ్వమని స్పష్టం చేశాయి. స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి.

ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు అధికారులు విద్యుత్‌, ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. అలాగే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు పోలీసులు 13 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు.


మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. వెయ్యి మందికి పైగా ముస్లింలు ఈ దాడిలో చనిపోయారని.. ఈ అల్లర్లలో మోదీ పాత్రపై ఆరోపణలు వచ్చాయని డాక్యుమెంటరీలో తెలిపింది. అలాగే 2019లో ప్రధానిగా తిరిగి బాధ్యతలు చేపట్టాక మోదీ వివాదాస్పద విధానాలు తీసుకొచ్చారని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించి 370 ఆర్టికల్‌ను రద్దు చేశారని వివరించింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×