Tdp-Janasena Bjp: ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ తాత్కాలికంగా బ్రేక్ వేయడాన్ని కూటమి పార్టీలు స్వాగతించాయి. ఈ మేరకు మూడు పార్టీలు కలిసి ఓ ప్రకటన విడుదల చేశాయి. అందులోని కీలక అంశాలను ప్రస్తావించాయి. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలన్నది వైసీపీ ఆలోచనగా పేర్కొన్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా ఎస్ఈసీ బ్రేక్ వేయడంతో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. సుప్రీంకోర్టుత తీర్పు తర్వాత ఎదురుదాడి మొదలుపెట్టింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంతో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ఆరోపించాయి. ఈ క్రమంలో కూటమి పార్టీలు టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అందులో కీలక అంశాలను ప్రస్తావించాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి మొదటినుంచి వైసీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉందని ఆరోపించాయి. ఇందులోభాగంగానే ఇప్పటివరకు పలు విడతలుగా 59 సార్లు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేశాయి. ఎన్నికలను ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నాయి. వైసీపీ సృష్టించిన అడ్డంకులను తొలగించి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హింసను ప్రేరేపించడం, పోలీసులపై దాడులకు తెగబడడం, రహదారులను తవ్వేయడం వంటి విధ్వంసాలు చేస్తోందని విమర్శించాయి.
గతంలో మాదిరిగా కాకుండా ధర్మబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంటే ఎన్నికలను అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టాయి. ఇది వైసీపీ ఆలోచనకు నిదర్శనమన్నారు. కూటమిలోని మూడు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, పీవీఎన్ మాధవ్‌లు ఉమ్మడి పత్రికా ప్రకటనను రాత్రి విడుదల చేశాయి.
ALSO READ: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్
ప్రజాస్వామ్యంపై కూటమి పార్టీలకు అచంచల విశ్వాసం ఉందన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా జరగడానికి మా వంతు సహకారం అందిస్తామని, ఈ క్రమంలో ఎస్‌ఈసీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా గౌరవిస్తామన్నాయి. స్థానిక సంస్థల బలోపేతంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కూటమి భావిస్తోందని, సకాలంలో ఎన్నికలు జరిగితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయన్నాయి. ఈ క్రమంలో నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి పనులు చేయాలని డిసైడ్ అయినట్టు తెలిపాయి.