BigTV English

Mla Koneti Adimulam: ఏపీలో ఓ ఎమ్మెల్యే రాసలీలలు.. కావాలనే కుట్ర..

Mla Koneti Adimulam: ఏపీలో ఓ ఎమ్మెల్యే రాసలీలలు.. కావాలనే కుట్ర..

Mla Koneti Adimulam: రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఏ పార్టీ వారైనా.. ఇందులో ఇరుక్కుపోయి తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఓ ఎమ్మెల్యే రొమాంటిక్ టేప్స్ కలకలం రేపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆయనెవరో తెలుసా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.


ఏపీలో సెక్స్ టేప్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో రచ్చ అయ్యింది. హిందూపురం మాజీ ఎంపీ గోరంగ్ల మాధవ్ వంతైంది. తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వార్తల్లోకి వచ్చేశారు. ఆయనకు సంబంధించిన సీక్రెట్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ: బెజవాడలో జోరుగా పనులు.. నాలుగురోజుల తర్వాత.. జగన్‌పై సీఎం చంద్రబాబు సెటైర్లు


ఈ వ్యవహారం ఇంటాబయటా హాట్ టాపిక్‌గా మారింది. మత్తు మందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారన్నది బాధితురాలి ఆరోపణ. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను రిలీజ్ చేసింది.

ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు కోనేటి ఆదిమూలం. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చాడని, వేధింపులు భరించలేక లొంగిపోయానని మనసులోని మాట బయటపెట్టింది బాధితురాలు. ఈ వ్యవహారం తన కుటుంబంలో చిచ్చురేపిందని తెలిపింది. ఆయన వ్యవహారాలు బయటపెట్టేందుకు సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి మీడియాకు ఇచ్చినట్టు తెలిపింది.

తన ప్రాణానికి హాని ఉందంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది బాధితురాలు. అర్థరాత్రి వేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్లు చెప్పింది. ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గోడు వెల్లబోసుకుంది.

రాసలీలల వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు.

Related News

APSRTC bus fight: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఘర్షణ.. సీటు కోసం బూతు దాకా వెళ్లిన వాగ్వాదం.. వీడియో వైరల్!

Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యకు కుట్ర

Vizag tourism: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లో టికెట్ ధర తగ్గింపు.. జర్నీకి సిద్ధమా!

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్

Vizag: ఏపీకి గూడ్‌న్యూస్.. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే

Big Stories

×