EPAPER

PM Modi Singapore MoUs: భారత్, సింగపూర్ మధ్య 4 కీలక ఒప్పందాలు.. సెమీకండక్టర్లు, డిజిటల్, ఆరోగ్య రంగాల్లో భాగస్వామ్యం..

PM Modi Singapore MoUs: భారత్, సింగపూర్ మధ్య 4 కీలక ఒప్పందాలు.. సెమీకండక్టర్లు, డిజిటల్, ఆరోగ్య రంగాల్లో భాగస్వామ్యం..

PM Modi Singapore MoUs| సింగపూర్ నూతన ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సెప్టెంబర్ 5, 2024న అధికారికంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచే విధంగా రెండు దేశాల ప్రధాన మంత్రులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.


ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కీలక చర్చల తరువాత సెమీకండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో – భాగస్వామ్యం కోసం ఇరు దేశాల మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రక్రియ ఇద్దరు ప్రధానుల పర్యకేక్షనలో జరిగింది.

కీలక ఒప్పందాల వివరాలు:
రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఒప్పందం డిజిటల్ టెక్నాలజీ రంగంలో జరిగింది. భారత దేశానికి చెందిన ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ , సింగపూర్ కు చెందిన డిజిటర్ డెవలప్మెంట్ అండ్ ఇన్‌ఫర్మేషన్ మంత్రిత్వశాఖలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. డిపిఐ, డిజిటల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, 5G, సూపర్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీల అంశాల్లో రెండు దేశాలు భాగస్వామ్యంగా పనిచేస్తాయి. ఈ రంగాల్లో నైపుణ్యత పెంపుపై దృష్టి ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు ఉంటాయి.


సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ భాగస్వామ్యంపై భారత దేశానికి చెందిన ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, సింగపూర్ కు చెందిన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ మధ్య రెండో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇండియా, సింగపూర్ సెమీకండక్టర్ క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా సెమీ కండక్టర్ డిజైన్, మాను ఫ్యాక్టరింగ్ కోసం నైపుణ్యాభివృద్ధి కోసం సహకరించుకుంటాయి. పైగా ఇండియాలో సెమీ కండక్టర్ రంగంలో సింగపూర్ పెట్టుబడులు కూడా చేస్తుంది. ప్రపంచంలో తయారయ్యే సెమీకండక్టర్లలో 10 శాతం సింగపూర్ తయారు చేస్తుంది. సెమీకండక్టర్ తయారీ యంత్రాలు 20 శాతం సింగపూర్ నుంచే ఉత్పత్తి జరుగుతుంది.

Also Read: ఉత్తర కొరియాలో వరదలు.. 30 అధికారులకు ఉరి శిక్ష వేసిన నియంత కిమ్..!

ఇక మూడో ఒప్పందం భారత దేశానికి చెందిన ఆరోగ్య మంత్రిత్వశాఖ, సింగపూర్ కు చెందిన ఆరోగ్య , వైద్య మంత్రిత్వశాఖ మధ్య కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. వైద్య, ఔషధ తయారీ రంగాల్లో రెండు దేశాలు పరిశోధన, ఇతర సహకారాలు అందించుకుంటాయి.

ఇక చివరి ఒప్పందం.. భారత దేశానికి చెందిన నైపుణ్యాభివృద్ధి, ఔద్యోగిక మంత్రిత్వశాఖ, సింగపూర్ కు చెందిన విద్యాశాఖ మధ్య కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు టెక్నికల్, వోకేషన్ విద్య లో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

“మీరు ప్రీమియర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మా మొదటి సమావేశం. నా వైపు నుండి మీకు చాలా అభినందనలు. 4జీ (నాల్గవ తరం నాయకులు) నాయకత్వంలో సింగపూర్ మరింత వేగంగా పురోగమిస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని మోదీ అన్నారు.

Related News

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Trump-Kamala Debate: ట్రంప్ – కమలా హారిస్ డిబేట్.. అనుమానాలెన్నో..

India China: చైనాతో సంప్రదింపులు చేస్తున్న అజిత్ దోవల్

Big Stories

×