CM Chandrababu satire: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పనులు జోరుగా సాగుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మంత్రులు, అధికారులు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తు న్నారు. వదర ప్రవాహం కాస్త తగ్గగానే విద్యుత్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగేసింది.
విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తనిఖీలు చేసింది. పలు ప్రాంతాల్లో అర్థరాత్రి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది. దీంతో వరద బాధితుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత వెలుతురు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ALSO READ: బిగ్ అలర్ట్.. ఇవాళే మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం
చాలా ప్రాంతాల్లో వరద ముంపు తగ్గడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 40 ఫైర్ ఇంజన్‌ల ద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు. వెంటనే పారిశుధ్య పనులను వేగవంతం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు.
కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకు రోడ్లపై చెత్తను తొలగించనున్నారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
మరోవైపు గురువారం రోజు విజయవాడ వరద ప్రాంతాల్లో రెండోసారి పర్యటించారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో మాట్లాడుతూ బుడమేరు వాగును నది అననడంపై సీఎం చంద్రబాబు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తారని అన్నారు.
అలాంటి వ్యక్తులు మాట్లాడిన దానికి తనను స్పందించమంటారా అని అన్నారు ముఖ్యమంత్రి. బుడమేరు వాగతే.. దాన్ని నది అంటున్నారని, ఈ రెండింటికి తేడా తెలీదని ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమన్నారు. బుడమేరుకు గేట్లు ఎత్తేసారని చెప్పడంపై ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు టమాటా-పొటాటోకి తేడా తెలియనివారు మనకి చెబుతున్నారని గుర్తు చేశారు సీఎం. సబ్జెక్టు లేదు.. నేర్చుకోవాలన్న ఆలోచన అంతకన్నా లేదు.. సాయంత్రం అయితే గల్లా పెట్టికి ఎంత వచ్చిందని చూసుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయనకు పని ఉంది కాబట్టి లండన్‌కు వెళ్తున్నారని, మనకు పనులు లేక ఇక్కడ తిరుగుతున్నామని వ్యాఖ్యానించారు.
వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసిన పురపాలక శాఖ. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్న సిబ్బంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది. ఇతర మున్సిపాలిటీల… pic.twitter.com/hz4WfGjgxY
— Telugu Desam Party (@JaiTDP) September 4, 2024
బుడమేరు ఒక వాగు అయితే, దాన్ని నది అంటాడు.. దానికి గేట్లు ఎత్తేసాం అంటాడు.. అది ఎటు వైపు ఉంది.. మా ఇల్లు ఎటు వైపు ఉంది ? నదికి వాగుకి తేడా తెలియని వాడు, టమాటాకి పొటాటోకి తేడా తెలియని వాడు మనకి చెప్తున్నాడు.#APGovtWithFloodVictims#VijayawadaFloods#CBNsFatherlyCare… pic.twitter.com/iq9bvWXCRS
— Telugu Desam Party (@JaiTDP) September 4, 2024